అంతర్జాతీయ అంశాలు

31102018

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :-
https://www.amazon.in/shop/groupschannelappsctspsc
31102018 అంతర్జాతీయ అంశాలు జన్మతః
ఇచ్చే పౌరసత్వం రద్దు!
అమెరికా పౌరులు కానివారు, అక్రమ వలసదారులకు (ఇమ్మిగ్రెంట్స్)అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతః ఇచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేయాలని యోచిస్తున్నారు.
 ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితి, పౌరసత్వంతో సంబంధం లేకుండా అమెరికాలో పుట్టిన పిల్లలు అమెరికా పౌరులే అవుతారు. ఈ నిబంధనను మార్చి, అమెరికా పౌరసత్వం ఉన్న వారికి పుట్టే బిడ్డలను మాత్రమే అమెరికా పౌరులుగా గుర్తించేలా ఆదేశాలిచ్చేందుకు ట్రంప్‌ కసరత్తు చేస్తున్నారు.
 అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం ఇక్కడ జన్మించిన పిల్లలకు పౌరసత్వ హక్కు దానంతట అదే సంక్రమిస్తోంది

మెక్సికో సరిహద్దుకు భారీగా అమెరికన్‌ దళాలు
• వలసల విషయంలో మరింత కఠిన వైఖరి అవలంభించడానికి , మెక్సికో సరిహద్దు భద్రతలో చురుకైన పాత్ర పోషించేందుకు మిలటరీ హెలికాప్టర్లు సహా 5,200కు పైగా దళాలను పంపనున్నట్టు అమెరికా ప్రకటించింది.
• గ్వాటిమాలా, హోండురాస్, ఎల్‌ సాల్విడార్‌ నుంచి మెక్సికో గుండా అమెరికాలోకి ప్రవేశించజూస్తున్న వలసదార్లను ఆ దేశం గనుక అడ్డుకోనట్టయితే, సరిహద్దులోకి మిలటరీని తరలిస్తామని, దక్షణ సరిహద్దును మూసివేస్తామని ఇటీవలే ట్రంప్‌ ప్రకటించారు.
• వలసదార్లను అడ్డుకోనట్టయితే పెండింగ్‌లో వున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి మళ్లుతామని పేర్కొన్నారు .
• ఈ నేపథ్యంలో వలసదార్లను అడ్డుకునేందుకు.. మెక్సికో అధ్యక్షుడు ఎన్‌రిక్‌ పెనా నిటో చర్యలు చేపడుతున్నారు.

గ్రూప్స్ ఛానెల్ లోని మెటీరియల్
గ్రూప్స్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ కావడానికి క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCsT09Rkupo6zVbvW5Qrbv5w
ప్లాగ్ షిప్ పధకాలు -2 :: https://youtu.be/yKhCd4uAJR8
ప్లాగ్ షిప్ పధకాలపై 100 ప్రాక్టిస్ ప్రశ్నలు :: https://youtu.be/_nEvMRPEjUk
14 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు:: https://youtu.be/Ci6DuPNsDEM
పంచాయత్ రాజ్ వ్యవస్థ పై కమిటీలు: : https://youtu.be/_WL7UfIk9FU
గ్రామ పంచాయతీ ల ఆదాయ వ్యయాల నిర్వహణ(AP): : https://youtu.be/YpnaC4AyXdg
ఆదాయ వ్యయాలు పధకాల అకౌంటింగ్ :: https://youtu.be/cg1g99uU7No
ఆడిట్ & అకౌంట్స్ పంచాయతీ కార్యదర్శి: https://youtu.be/jkJthQeFO6E
అకౌంటింగ్ (పార్ట్ 4) :: https://youtu.be/vCJDNFbbxdE
అకౌంటింగ్ (పార్ట్ 5) :: https://youtu.be/HDzz3Sfnxx8
మోడల్ అకౌంటింగ్ వ్యవస్థ (పార్ట్ 6) :: https://youtu.be/-7s5vR73s2A
పంచాయతీ బడ్జెట్ : https://youtu.be/Vfgt42atCrE

పి డి అకౌంట్స్ : https://youtu.be/Vtf7swDg-Fc
నెగిటివ్ మార్క్స్ ని అధిగమించడం ఎలా ?:: https://youtu.be/0Vs2ssoj2Lw
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2017-18 :: https://youtu.be/mmHibTvyXmY
మానావాభి వృద్ధి HDI రిపోర్ట్ 2018 :: https://youtu.be/EJVEDWjAr4o
ప్లాగ్ షిప్ పధకాలు -1 :: https://youtu.be/_u696gRw5g4
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2016-17 పార్ట్ 2 :: https://youtu.be/JoeKj0C0GcI
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం పై 100 ప్రశ్నలు::పార్ట్ -3:: https://youtu.be/xPUCAhyST0c
15 ఆర్ధిక సంఘం –నిర్మాణం –విధి –విధానాలు :: https://youtu.be/JbIZvW28YH4
ఆర్థిక సంఘం పై 25 ప్రశ్నలు:: https://youtu.be/sywQUjKMkPc

కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 15.2018

రక్షణ, వాణిజ్య సంబంధాలు విస్తరణ-భారత్‌-ఇటలీ

దిల్లీకి వచ్చిన ఇటలీ ప్రధాని జుసపె కాంటే తో ప్రధాని నరేంద్రమోదీ చర్చలు.

• రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాల్లో, మౌలిక సదుపాయాల కల్పనలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించుకోవాలని , ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలను కల్పిస్తున్న దేశాల తీరును ఖండించాయి.
• అణు సరఫరాదారుల బృందం (NSG)లో భారత్‌కు సభ్యత్వం కల్పించడానికి కావాల్సిన సహకారాన్ని అందిస్తామని ఇటలీ హామీ ఇచ్చినట్లు రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది.
• 2014 ఆగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు మొదలైన తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇటలీ దృష్టి సారించింది.
• రైల్వే, మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, పునరుత్పాదక ఇంధనం, విద్య, నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భావించాయి. భారత్‌-ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పరస్పరం లబ్ధిదాయకంగా రూపొందించుకునేందుకు తిరిగి చర్చలు ప్రారంభించాలని నిర్ణయించాయి.

30.10.2018

సముద్రంలో కూలిన విమానం
• ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి 29.10.2018 ఉదయం 189 మందితో పంగ్‌కల్‌ పినాంగ్‌ సిటీకి బయల్దేరిన ‘లయన్‌ ఎయిర్‌’ జెట్‌ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది.
• బయల్దేరిన 13 నిమిషాలకే జకార్తాకు 32 మైళ్ల దూరంలో, కెరవాంగ్‌ సముద్ర తీరానికి దగ్గర్లో సముద్రంలో కూలిపోయింది.
• విమానంలో ప్రయాణిస్తున్న 182 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు.
• ప్రమాదానికి గురైన ‘బోయింగ్‌ –737 మాక్స్‌’ జేటీ 610 విమానానికి భారతీయుడైన భవ్య సునేజా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.
త్వరలో జపాన్‌తో 2+2 చర్చలు
 ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌ పర్యటన.
 భారత్‌–జపాన్‌ 13వ ద్వైపాక్షిక సమావేశాల్లో భాగంగా సోమవారం(29.10.2018) టోక్యోలో జపాన్‌ ప్రధాని షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక, రక్షణ, ప్రాంతీయ భద్రత, ఉగ్రవాదం, జపాన్‌ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ముంబై–అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు (MAHSRP)సహా పలు అంశాలపై వారు విస్తృత చర్చలు జరిపారు.
 భారత్, జపాన్‌ల విదేశాంగ, రక్షణ మంత్రులతో కూడిన 2+2 చర్చలు త్వరలో జరగనున్నాయి.
 వివిధ రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి.
 భారత్‌–జపాన్‌ల బంధం ప్రపంచంలోనే అత్యంత బలమైనదని అబే పేర్కొన్నారు. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి జపాన్‌ మద్దతు తెలిపింది.

 28&29.10.2018 లలో 13వ భారత్‌-జపాన్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సు జరిగింది.
 రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఎంతో బలోపేతమయిందని, ఇప్పుడది ప్రత్యేక వ్యూహాత్మక-ప్రపంచస్థాయి బంధంగా పెనవేసుకుందని మోదీ చెప్పారు.
 దేశంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్‌ ఫ్యూజీ పర్వతానికి చెంతనున్న రిసార్ట్‌ ఆవరణలో ఇద్దరూ కలిసి కాసేపు విహరించారు.
 రాజస్థాన్‌లో చేతితో రూపొందించిన రాతి కానుకలను, యూపీ చేనేత కళాకారులు నేసిన రగ్గులు, జోధ్‌పురీ కలపతో తయారైన భోషాణాన్నీ అబేకు మోదీ కానుకగా ఇచ్చారు.
 ఆ తర్వాత ఇద్దరు నేతలూ కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద రోబోల తయారీ పరిశ్రమలో ఒకటైన ‘ఫనుక్‌’ కార్పొరేషన్‌కు వెళ్లారు. రోబోల తయారీ, యాంత్రికీకరణ ప్రక్రియ, వాటి పనితీరును పరిశీలించారు.
2017 లో సబర్మతీ తీరాన… నేడు సొంత విల్లాలో
 గత ఏడాది 2017 సెప్టెంబరులో అబే భారతదేశ పర్యటనకు వెళ్లినప్పుడు నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు ఆహ్వానించి, సబర్మతీ నదీ తీరాన ఆతిథ్యమిచ్చిన రీతిలోనే , జపాన్‌కు వచ్చిన మోదీని కవగుచి సరస్సు సమీపంలోని తన ప్రైవేటు విల్లాకు అబే ఆహ్వానించి ప్రైవేట్‌ విందునిచ్చారు.
 జపాన్‌ ప్రధాని ఒక విదేశీ నేతను ఇక్కడకు తీసుకురావడం ఇదే ప్రథమం.
 ఇరువురు నేతలూ టోక్యోకు కైజీ ఎక్స్‌ ప్రెస్‌ రైల్లో వెళ్లారు.
 జపాన్‌ సహకారంతో ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య షింకన్‌సేన్‌ బులెట్‌ రైళ్లు నడవడం మొదలైన రోజు రెండు దేశాల మైత్రి ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అబే పేర్కొన్నారు.
 2014 నుంచి ఇప్పటి వరకు తామిద్దరం 12సార్లు సమావేశమయ్యామని మోదీ గుర్తు చేసుకున్నారు.

29.10.2018 సిరియా కన్నా 3 రెట్లు ప్రమాదకరంగా పాకిస్థాన్ : GTTI
 సిరియా కన్నా 3 రెట్లు ప్రమాదకరంగా పాకిస్థాన్ మారుతోందని జీటీటీఐ నివేదిక పేర్కొంది.
 ‘‘హ్యూమానిటీ ఎట్ రిస్క్ – గ్లోబల్ టై్ థ్రెట్ ఇండికెంట్’’- GTTI
 మొత్తం 200 ఉగ్రసంస్థలపై అధ్యయనం చేసి రూపొందించిన జీటీటీఐ రిపోర్టును ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ, స్ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూప్‌లు సంయుక్తంగా అక్టోబర్ 27న విడుదల చేశాయి.
 ఎక్కువ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ, సహాయపడుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్థాన్‌తో మానవాళికి ముప్పు ఉందని ఈ నివేదిక వెల్లడించింది.
 అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతిస్తోన్న పాకిస్థాన్‌లో అత్యధిక సంఖ్యలో ఉగ్రవాద కేంద్రాలు ఉన్నాయని, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థల వల్ల అంతర్జాతీయ భద్రతకు పెను ముప్పు ఉన్నట్లు జీటీటీఐ తెలిపింది.

స్టెమ్‌’లో ఇండియన్‌ జమ్స్‌
STEM – సైన్స్‌ ,టెక్నాలజీ,ఇంజనీరింగ్‌ & మేధమెటిక్స్‌
• అమెరికాలో సైన్స్‌ – టెక్నాలజీ – ఇంజనీరింగ్‌ – మేధమెటిక్స్‌ (స్టెమ్‌) కోర్సులు చేస్తున్న భారతీయ విద్యార్థులు ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రాములో చేరేందుకు భారీగా అనుమతులు పొందారు.
• యూఎస్‌లో చదువుకునే విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక, అక్కడే వుండి ఉద్యోగం చేయాలనుకుంటే ఓపీటీ వర్క్‌ ఆథరైజేషన్‌ తప్పనిసరి.
• యుఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ (ICE) విడుదల చేసిన గణాంకాల ప్రకారం – సెప్టెంబరు 30తో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో – మొత్తం విదేశాలకు చెందిన 89,839 మంది ‘స్టెమ్‌’ విద్యార్థులు ఓపీటీ వర్క్‌ ఆథరైజేషన్‌ పొందారు.
• ఇందులో అత్యధికులు ( 50,507 మంది / 56శాతం) భారతీయులే. 21,705 (24శాతం) ఓపీటీ అనుమతులతో చైనా విద్యార్థులు ఆ తర్వాత స్థానంలో వున్నారు.

• ఎఫ్‌ –1 స్టడీ వీసాలపై అమెరికా వెళ్లిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ కాలంలో లేదా ఆ తర్వాత ఓపీటీ కింద 12 మాసాలు పని చేసేందుకు వీలుంటుంది.

• స్టెమ్‌ డిగ్రీలు చేసేవారు ఓపీటీ ఆథరైజేషన్‌ను మరో 24 మాసాల కాలం పొడిగించుకునేందుకు అవకాశముంటుంది. ఓపీటీ అభ్యర్థుల సంఖ్య విషయంలో ఎలాంటి పరిమితులూ వుండవు.
సెవిస్‌ నివేదిక
 స్టూడెంట్‌ అండ్‌ EXCHANGE విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (సెవిస్‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం – 2017 నాటికి అమెరికాలో మొత్తం 15.90 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చైనా విద్యార్థులే (4,81,106) ఎక్కువ. 2,49,763 మందికి పైగా విద్యార్థులతో భారత్‌ రెండో స్థానంలో వుండగా.. దక్షిణ కొరియా (95,701) సౌదీ అరేబియా (72,358) జపాన్‌ (41,862) ఆ తర్వాత స్థానాల్లో వున్నాయి.

28102018
పాకిస్తాన్‌లో భారత సినిమాలు బంద్‌
పాకిస్తాన్‌ టీవీ చానళ్లలో భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రసారంపై నిషేధాన్ని అక్కడి సుప్రీంకోర్టు శనివారం పునరుద్ధరించింది.
 ఎలాంటి అభ్యంతరం లేని కార్యక్రమాలను మాత్రమే ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
 యునైటెడ్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌(యూపీఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన జడ్జి జస్టిస్‌ సకీజ్‌ నిసార్‌ ఈ మేరకు తీర్పునిచ్చారు.
 ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘దైయమెర్‌–భాషా ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత్‌ అడ్డుకుంటోంది. కనీసం ఆ దేశపు సినిమాలు, టీవీ కార్యక్రమాలను కూడా మనం అడ్డుకోలేమా?’ అని ప్రశ్నించారు. దీంతో జడ్జి పాక్‌ అధికారులు ఆమోదించిన చిత్రాలు, కార్యక్రమాలనే ప్రసారం చేయాలని ఆదేశించారు.
శ్రీలంక పార్లమెంటు రద్దు
 రణిల్‌ విక్రమసింఘేను ప్రధాని పదవి నుంచి దించేసిన ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేశారు.
 బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును 28.10.2018 న సమావేశపరచాలని రణిల్‌ విక్రమసింఘే పార్లమెంటు స్పీకర్‌ను కోరగా, అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం.
 విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ (యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ)కి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు
27.10.2018
గ్రీకు దీవిని వణికించిన భూకంపం
 ఏథెన్స్‌ – గ్రీస్‌లోని ప్రముఖ పర్యాటక దీవి జకింథోస్‌ను 26.10.2018 న శక్తిమంతమైన భూకంపం వణికించింది.
 సముద్ర గర్భంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది.

వేధింపులపై గూగుల్‌ ఉక్కుపాదం
 సహోద్యోగులపై లైంగిక వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడేవారిపై టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ చర్యలు.
లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 2016 నుంచి ఇప్పటివరకూ 48 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు గూగుల్‌ తెలిపింది.
 సీఈవో సుందర్‌ పిచాయ్,
 ఉపాధ్యక్షురాలు(ప్రజా వ్యవహారాలు) ఐలీన్‌ నాటన్‌.
 లైంగికవేధింపుల కారణంగా గూగుల్‌ నుంచి వైదొలిగిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సృష్టికర్త ఆండీ రూబీన్‌కు రూ.659.38 కోట్లు(90 మిలియన్‌ డాలర్లు) ఎగ్జిట్‌ ప్యాకేజీ ఇచ్చారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది.
https://amzn.to/2CWFQC3
అంతర్జాతీయ అంశాలు డౌన్లోడ్అంతర్జాతీయ అంశాలు