ఎకానమీ కరెంట్ అఫైర్స్

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :-
https://www.amazon.in/shop/groupschannelappsctspsc

ఎకానమీ
అమెరికా–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం
 అమెరికా–భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ఇండియా లీడర్‌షిప్‌ సమిట్‌ ని నిర్వహించినది.
 ‘అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత 2008–2014 మధ్య కాలంలో చూస్తే,అప్పటి ప్రభుత్వ తీవ్ర ఒత్తిళ్ల కారణంగా బ్యాంకులు ఎడాపెడా రుణాలిచ్చేయడంతో.. సగటున 14 శాతంగా ఉండే రుణ వృద్ధి ఒకే ఏడాదిలో ఏకంగా 31 శాతానికి ఎగిసిందని అరుణ్జైట్లీ పేర్కొన్నారు.
 2014 నుంచి 2019 మధ్య కాలంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు రెట్టింపవుతుందని అంచనా వేస్తున్నట్లు జైట్లీ వివరించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్య నాలుగేళ్లలో 6.8 కోట్లకు పెరిగిందన్నారు.
 ఈ ఏడాది 7.5–7.6 కోట్లకు చేరొచ్చని, దీంతో రెట్టింపయినట్లవుతుందని తెలిపారు.పాలనాపరమైన పారదర్శక సంస్కరణలతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు.
నిధుల కొరతపై ఎఫ్‌ఎస్‌డీసీ సమీక్ష
 నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలు ఎదుర్కొంటున్న నిధుల కొరత అంశాలను ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమీక్షించింది. (30.10.2018)
 Financial Stability and Development Council FSDC
 కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్, సెబీ చైర్మన్, ఐఆర్‌డీఏఐ, పీఎఫ్‌ఆర్‌డీఏ తదితర నియంత్రణ సంస్థల చీఫ్‌లు పాల్గొన్నారు.
Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India (RBI),
Dr. Hasmukh Adhia, Finance Secretary and Secretary, Department of Revenue,
Shri Subhash Chandra Garg, Secretary, Department of Economic Affairs
Shri Rajiv Kumar, Secretary, Department of Financial Services,
Shri Injeti Srinivas, Secretary, Ministry of Corporate Affairs,
Shri Ajay Prakash Sawhney Secretary, Ministry of Electronics and Information Technology,
Shri Ajay Tyagi, Chairman, Securities and Exchange Board of India,
Shri Subhash Chandra Khuntia, Chairman, Insurance Regulatory and Development Authority of India,
Shri Hemant G. Contractor, Chairman, Pension Fund Regulatory and Development Authority,
Dr. M. S. Sahoo, Chairperson, Insolvency and Bankruptcy Board of India .
సంపన్న దేశాల్లో అగ్రగామిగా భారత్‌
 24వ మొబికామ్‌ సదస్సు డిల్లి లో జరిగింది .
 తొలి మూడు పారిశ్రామిక విప్లవాల విషయంలో వెనుకబడినప్పటికీ.. టెక్నాలజీని విరివిగా ఉపయోగించే భారీ యువ జనాభా ఊతంతో నాలుగో పారిశ్రామిక విప్లవానికి సారథ్యం వహించే స్థాయిలో భారత్‌ ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ చెప్పారు.
 ‘1990లలో దేశ జీడీపీ 350 బిలియన్‌ డాలర్లు. ఇప్పుడు ఇది 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరువగా ఉంది.
 భారత్‌ ఈ స్థాయికి చేరుకోగలదని ఊహించినవారు చాలా తక్కువ మందే ఉంటారు.
 ప్రస్తుతం టాప్‌ 3 సంపన్న దేశాల్లో ఒకటిగా ఎదిగే క్రమంలో ముందుకు దూసుకుపోతోంది‘ అని అంబానీ చెప్పారు.
 ప్రస్తుతం అత్యధిక టెక్నాలజీ ఆధారిత స్టార్టప్స్‌ కేంద్రంగా భారత్‌ మూడో స్థానంలో ఉందని తెలిపారు.
 వచ్చే రెండు దశాబ్దాల కాలంలో పపంచానికి భారత్‌ సారథ్యం వహించగలదని, తదుపరి ప్రపంచ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించగలదని అంబానీ ధీమా వ్యక్తం చేశారు.

NOV .1న వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు!
 దీపావళి నేపథ్యంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది.
 ఇందులో భాగంగా నవంబర్‌1వ తేదీన ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు విడుదల చేయనుంది.
 పండుగల సీజన్‌ ఫండ్స్‌ డిమాండ్స్‌ ను ఎదుర్కొనడానికి నవంబర్‌ నెలలో మొత్తం రూ.40,000 కోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గత వారం ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

29102018 బయో మెట్రిక్ విధానంలో ఈ-వీసా
పర్యాటకులకు బయో మెట్రిక్ విధానంలో ఈ-వీసా మంజూరు చేయనున్నట్లు భారత విదేశాంగశాఖ అక్టోబర్ 28న ప్రకటన .
 ప్రపంచంలోని 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగశాఖ పేర్కొంది.
 ఈ 8 నగరాల్లో ఒట్టావా (కెనడా),
సెయింట్ పీటర్స్‌బర్గ్, వ్లాడివోస్తక్ (రష్యా),
మ్యూనిచ్ (జర్మనీ), బ్రస్సెల్స్ (బెల్జియం),
ఓస్లో (నార్వే), బుడాపెస్ట్ (హంగేరి), జగ్రీబ్ (క్రొయేషియా) ఉన్నాయి.
 ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్ వివరాలు ఇస్తే ఈ-వీసా లభిస్తుంది
 భారత్‌కు వచ్చాక మళ్లీ ఈ-వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
రూ. 1.8 లక్షల కోట్లు దాటనున్న మొండిబాకీల రికవరీ
కొత్త దివాలా చట్టం (ఐబీసీ) ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.80 లక్షల కోట్ల పైగా మొండిబాకీల (ఎన్‌పీఏ) రికవరీ కాగలదని కేంద్రం అంచనా వేస్తోంది.
 తాము నిర్దేశించుకున్న రూ. 1.80 లక్షల కోట్ల మొండిబాకీల రికవరీ లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 2017–18లో బ్యాంకులు రూ. 74,562 కోట్లు రాబట్టుకోగలిగాయి.
 ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ. 36,551 కోట్లు రికవర్‌ చేసుకున్నాయి.
 రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాల మేరకు నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు నివేదించిన 12 భారీ మొండిబాకీ కేసుల పరిష్కారం ద్వారా కనీసం రూ. లక్ష కోట్ల పైగా రాగలవని బ్యాంకులు ఆశిస్తున్నాయి.

నోట్ల రద్దుపై ఆర్‌బీఐ గవర్నరుకు నోటీసు
 నోట్ల రద్దు, తదనంతర పర్యవసానాలపై వివరించేందుకు నవంబరు 12న హాజరు కావాలని ఆర్‌బీఐ గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌కు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ(ఆర్థికం) నోటీసులు జారీ చేసింది.
 వీరప్పమొయిలీ అధ్యక్షుడిగా ఉన్న కమిటీలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
 అనియంత్రిత మదుపు పథకాల బిల్లును నిషేధించడం, సంబంధిత అంశాలపైనా వివరణ కోరింది.
 ఒకే అంశంపై ఆర్‌బీఐ గవర్నరును పార్లమెంటరీ కమిటీ మూడుసార్లు పిలిపించడం ఇదే తొలిసారి.
 గత ఏడాది జనవరి, జులైలో కమిటీ ముందు హాజరైన ఉర్జిత్‌పటేల్‌ రూ.500, వెయ్యి నోట్ల రద్దుపై వివరాలు వెల్లడించారు.

30 సార్లు సమావేశమైన జీఎస్టీ మండలి
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) మండలి గత రెండేళ్లలో 30 సార్లు సమావేశమైందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
 ఈ కాలంలో జీఎస్టీకి సంబంధించి మొత్తం 918 నిర్ణయాలను జీఎస్టీ మండలి తీసుకుంది.
 ఇందులో జీఎస్టీ విధి విధానాలు, రేట్లు, పరిహారం వంటి నిర్ణయాలు ఉన్నాయి.
 ఇప్పటికే సుమారు 96 శాతం నిర్ణయాలను అమలు చేయగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
 ఒకే దేశం- ఒకే పన్ను నినాదంతో 2000లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ జీఎస్టీకి శ్రీకారం చుట్టగా 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది.
GST మండలి నేపధ్యం :-
 ఏర్పాటు : 15.09.2016న
 అధికరణ :- ఆర్టికల్ 279A
 చైర్ పర్సన్ :- కేంద్ర ఆర్ధిక మంత్రి
28102018 ప్రపంచంలో పెరుగుతున్న ఆకలి కేకలు
 ప్రతి ముగ్గురిలో ఓ మహిళ పౌష్టికాహార లోపం వల్ల బాధ పడుతున్నారు.
 ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి 2014 వరకు వరుసగా ఆహార కొరత తగ్గుతూ రాగా, 2015 నుంచి మళ్లీ కొరత అనూహ్యంగా పెరుగుతూ వస్తోందని, దీనికి వాతావరణ మార్పులే కారణమని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడిస్తోంది
 2016 సంవత్సరం నుంచి ఆహారం అందుబాటులేని వారి సంఖ్య అదనంగా 1.5 కోట్ల కు పెరిగింది.
 దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆహారం అందుబాటులో లేనివారి సంఖ్య 82 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వార్షిక ఆహార భద్రతా నివేదిక వెల్లడించింది.
 పదేళ్ల క్రితం ప్రపంచంలో ఆకలి కేకలు ఏ స్థాయిలో ఉండేవో ఇప్పుడు ఆ స్థాయికి చేరకున్నాయని ఈ నివేదిక తెలియజేస్తోంది.

 మధ్య అమెరికాలో కరువు పరిస్థితులు తలెత్తి పంటల దిగుబడి తగ్గడంతో అమెరికా సరిహద్దుల్లో వలసల అలజడి మొదలైందని నివేదిక వెల్లడించింది.
 ప్రపంచవ్యాప్తంగా గత యాభై ఏళ్లుగా భూ వాతావరణం వేడెక్కుతూ వస్తోందని, ముఖ్యంగా 2014, 2015, 2016 సంవత్సరాల్లో భూ వాతావరణం గణనీయంగా వేడెక్కిందని ఐక్యరాజ్య సమితి తెలియజేసింది.
 ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ఏర్పడుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు పడుతున్నాయని తెలిపింది.
 వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం ఉండాలని, ఆ విషయమై వ్యవసాయ రంగంలో ఆధునిక పరిశోధనలు పెరగాలని సమితి అభిప్రాయపడింది.
 వ్యవసాయ రంగంలో పరిశోధనల కోసం ప్రపంచ దేశాలు కేవలం మూడు శాతం ఆర్థిక వనరులను ఖర్చు చేయడం శోచనీయమని సమితి అభిప్రాయపడింది.

27102018 విత్తనం నుంచి విపణి’ దాకా అండాదండా-ప్రధాని
లక్నో లో ‘కృషి కుంభ్‌’ ప్రారంభోత్సవ కార్యక్రమo .
 మూడురోజుల పాటు జరిగే ‘కృషి కుంభ్‌’లో రైతులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, పరిశోధన సంస్థలు, విధాన నిర్ణేతలు పాల్గొంటున్నారు.
 కృషికుంభ్‌ లక్ష్యం:- వ్యవసాయరంగానికి సంబంధించిన నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, ఈ దిశగా వ్యాపార అవకాశాల గురించి అన్నదాతల్లో అవగాహన కల్పన.
 వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని ఆవిష్కరణలు, ఉత్పత్తులు, ఇతరత్రా సమాచారాన్ని రైతులు తెలుసుకునేందుకు వీలుగా సుమారు 13 హెక్టార్ల విస్తీర్ణంలో ‘కృషి కుంభ్‌’ను నిర్వహిస్తున్నారు.
 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు
 ‘విత్తనం నుంచి విపణి’ (బీజ్‌ టు బజార్‌)దాకా రైతుల కోసం …వారి ఉత్పత్తుల కోసం అత్యంత పటిష్ఠమైన మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
 వారణాశిలో వరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు.
ఆధార్‌ ‘ఇ-కేవైసీ’ని నిలిపేయండి
• ఆధార్‌ను ప్రైవేటు కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వాడకూడదని సుప్రీంకోర్టు ఆదేశం.
• ప్రస్తుత మొబైల్‌ఫోన్‌ వినియోగదారులతో పాటు కొత్త కనెక్షన్లు తీసుకునేవారి ఆధార్‌ ఎలక్ట్రానిక్‌ వెరిఫికేషన్‌ను చేపట్టవద్దని కేంద్రం స్పష్టం చేసింది.
• ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలకు శుక్రవారం కేంద్ర టెలికాంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది.

26102018 ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ప్రారంభం
• ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2018 (ఐఎంసీ) న్యూఢిల్లీలో అక్టోబర్ 25న ప్రారంభమైంది.
• ముకేశ్ అంబానీ మాట్లాడుతూ… బ్రాడ్‌బ్యాండ్ వినియోగంలో ప్రస్తుతం 135వ స్థానంలో ఉన్న భారత్ త్వరలో టాప్ 3 దేశాల్లో ఒకటిగా ఎదగగలదని చెప్పారు.

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :-
https://www.amazon.in/shop/groupschannelappsctspsc

గ్రూప్స్ ఛానెల్ లోని మెటీరియల్
గ్రూప్స్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ కావడానికి క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCsT09Rkupo6zVbvW5Qrbv5w
ప్లాగ్ షిప్ పధకాలు -2 :: https://youtu.be/yKhCd4uAJR8
ప్లాగ్ షిప్ పధకాలపై 100 ప్రాక్టిస్ ప్రశ్నలు :: https://youtu.be/_nEvMRPEjUk
14 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు:: https://youtu.be/Ci6DuPNsDEM
పంచాయత్ రాజ్ వ్యవస్థ పై కమిటీలు: : https://youtu.be/_WL7UfIk9FU
గ్రామ పంచాయతీ ల ఆదాయ వ్యయాల నిర్వహణ(AP): : https://youtu.be/YpnaC4AyXdg
ఆదాయ వ్యయాలు పధకాల అకౌంటింగ్ :: https://youtu.be/cg1g99uU7No
ఆడిట్ & అకౌంట్స్ పంచాయతీ కార్యదర్శి: https://youtu.be/jkJthQeFO6E
అకౌంటింగ్ (పార్ట్ 4) :: https://youtu.be/vCJDNFbbxdE
అకౌంటింగ్ (పార్ట్ 5) :: https://youtu.be/HDzz3Sfnxx8
మోడల్ అకౌంటింగ్ వ్యవస్థ (పార్ట్ 6) :: https://youtu.be/-7s5vR73s2A
పంచాయతీ బడ్జెట్ : https://youtu.be/Vfgt42atCrE
పి డి అకౌంట్స్ : https://youtu.be/Vtf7swDg-Fc
నెగిటివ్ మార్క్స్ ని అధిగమించడం ఎలా ?:: https://youtu.be/0Vs2ssoj2Lw
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2017-18 :: https://youtu.be/mmHibTvyXmY
మానావాభి వృద్ధి HDI రిపోర్ట్ 2018 :: https://youtu.be/EJVEDWjAr4o
ప్లాగ్ షిప్ పధకాలు -1 :: https://youtu.be/_u696gRw5g4
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2016-17 పార్ట్ 2 :: https://youtu.be/JoeKj0C0GcI
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం పై 100 ప్రశ్నలు::పార్ట్ -3:: https://youtu.be/xPUCAhyST0c
15 ఆర్ధిక సంఘం –నిర్మాణం –విధి –విధానాలు :: https://youtu.be/JbIZvW28YH4
ఆర్థిక సంఘం పై 25 ప్రశ్నలు:: https://youtu.be/sywQUjKMkPc

కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 15.2018

ఎకానమీ current affairs downloadఎకానమీ కరెంట్ అఫైర్స్ download