కరెంట్ అఫైర్స్ అక్టోబర్ (18 to25)

డైలీ కరెంట్ అఫైర్స్
18 to 25.10.2018

జాతీయం

లైంగిక వేధింపులపై జీవోఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు
 కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)ను కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న ఏర్పాటు
 ఈ బృందానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం
 సభ్యులు:- రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ .
 లక్ష్యం :-మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుంది.
 అన్నివర్గాలను సంప్రదించి లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా జీవోఎం కేంద్రానికి నివేదికను సమర్పిస్తుంది.

PDF DOWN LOAD (కరెంట్ అఫైర్స్ ) చేయండి :-

18102018 pdf part

మహిళలకోసంషీ-బాక్స్…

 మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘షీ-బాక్స్’ ఏర్పాటు చేయనున్నారు.
 ఈ మేరకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అక్టోబర్ 24న ప్రకటన.
 ఏ స్థాయి ఉద్యోగిని అయినా ఇందులో ఫిర్యాదు చేస్తే, కంపెనీలోని సంబంధిత పరిష్కార విభాగానికి దీన్ని బదిలీ చేస్తారు.
 బాధితుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

అసోం-మేఘాలయల మధ్య 19.3 కి.మీ వారధి
 అసోం, మేఘాలయల మధ్య ప్రయాణదూరం, కాలాన్ని తగ్గించడానికి బ్రహ్మపుత్ర నదిపై నాలుగు వరుసల రహదారి వంతెనను నిర్మించనున్నారు.
 మేఘాలయలోని ఫుల్బరి, అసోంలోని దుబ్రీలను అనుసంధానం చేసే ఈ వంతెన మనదేశంలోనే అతిపొడవైన వంతెనగా చరిత్రపుటలకెక్కనుంది.
 రెండున్నర గంటలు పడుతున్న ప్రయాణకాలం 15-20 నిముషాలకు తగ్గిపోనుంది. ఇది పూర్తి అయితే పశ్చిమబెంగాల్‌ నుంచి అసోంకూ రాకపోకలు సులువవుతాయి.
 2026-27కి అందుబాటులోకి తేవాలని జాతీయ రహదారులు, పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ లిమిటెడ్‌(NHIDCL)
 జపాన్‌కు చెందిన ‘జి.ఐ.సి.ఎ.’ అనే ఆర్థికసంస్థ నిధులు సమకూరుస్తోంది.
 Japan International Cooperation Agency (JICA)
 బ్రహ్మపుత్ర నదిపై అసోంలోని ధోలా-సాదియాల మధ్య 9.16 కిమీ పొడవున నిర్మించిన వంతెన ప్రస్తుతం మనదేశంలోనే ఓ నదిపై నిర్మించిన అతిపొడవైన వంతెన.
త్వరలో ముంబయి-గోవా మధ్య విలాసవంతమైన నౌక
 ముంబయి నుంచి గోవా మధ్య ప్రయాణించే, మనదేశంలోనే మొట్టమొదటి విలాసవంతమైన పర్యటకనౌక ‘‘అంగ్‌రియా’’ త్వరలోనే ప్రారంభం కానుంది.
 కొత్తగా దేశీయంగా నిర్మించిన దేశీయ క్రూయిజ్‌ టెర్మినల్‌ నుంచి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
 సముద్రయానం ద్వారా భారతదేశానికి పెద్దఎత్తున ఆదాయం సమకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నౌకా పర్యటకాన్ని ప్రోత్సహించాలని యోచిస్తోంది.

ఐదు హైకోర్టులకు సీజేల నియామకం
 దేశంలోని ఐదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల(సీజే)ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 24న ఉత్తర్వులు జారీ చేశారు.
 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
కొత్తగా నియమితులైన సీజేలు
హైకోర్టు పేరు ప్రధాన న్యాయమూర్తి
ఉత్తరాఖండ్ హైకోర్టు జస్టిస్ రమేశ్ రంగనాథన్
సిక్కిం హైకోర్టు జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్
కలకత్తా హైకోర్టు డీకే గుప్తా
గువాహటి హైకోర్టు ఏ సోమయ్య బోపన్న
బాంబే హైకోర్టు జస్టిస్ నరేశ్ హరిశ్చంద్ర పాటిల్
సీఈసీ, ఈసీల నియామకాలకూ కొలీజియం!
 ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ), కమిషనర్ల(ఈసీ) నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థ కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది.
 ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్కే కౌల్‌ల ధర్మాసనం .
 సామాజిక కార్యకర్త, న్యాయవాది అనూప్‌ బరన్వాల్‌ 2015లో ఈ పిల్‌ వేశారు.
 దేశంలో ఎన్నికలు నిర్వహించే అధికారాలు, పర్యవేక్షణను ఎన్నికల సంఘానికి కట్టబెట్టిన నిబంధన 324ను సునిశితంగా పరిశీలించాల్సి ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చట్టం, రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన అంశాల్ని విచారించే సందర్భంలో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటుచేయొచ్చని ఆర్టికల్‌ 145(3)ని ప్రస్తావించింది.

2020 నుంచి బీఎస్-4 అమ్మకాలు బంద్ : సుప్రీంకోర్టు
 దేశంలో 2020, ఏప్రిల్ 1 నుంచి భారత్ స్టేజ్(బీఎస్)-4 వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ నిలిపివేయాల ని సుప్రీంకోర్టు అక్టోబర్ 24న ఆదేశించింది.
 అప్పటి నుంచి కేవలం బీఎస్-6 వాహనాలను మాత్రమే అమ్మాలనితీర్పు .
 ధర్మాసనం :-జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల
 దేశంలో వాయుకాలుష్యం నియంత్రించేందుకు కోర్టు ఈ మేరకు తీర్పు.
 యూరో-6 ప్రమాణాలతో సమానమైన బీఎస్-6 వాహనాల ద్వారా కాలుష్య ఉద్గారాలు తక్కువస్థాయిలో వెలువడతాయి.

పర్యావరణానికి హాని కలిగించే క్రాకర్స్‌ కు సుప్రీం నో.
 దేశంలో బాణాసంచా నిషేధంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు .
 బాణాసంచా విక్రయాల తయారీ, విక్రయాలను నిషేధించలేమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది.
 లైసెన్స్‌ కలిగిన వ్యాపారులే బాణాసంచా విక్రయించాలని, ఆన్‌లైన్‌లో విక్రయాలు జరపరాదని పేర్కొంది.
1. Only reduced emission crackers can be manufactured and sold.
2. Ladis or chain-firecrackers which are very noisy are banned.
3. Sale of firecrackers will happen only through licensed vendors.
4. Only those that are within noise pollution limits set in July 2005 verdict are allowed.
5. Firecrackers are allowed from 8 to 10 pm on Diwali,
11:55 pm to 12:30 am on Christmas and New Year.

 రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకే బాణాసంచా కాల్చాలని సూచించింది. పర్యావరణానికి హానికలిగించని క్రాకర్స్‌ ను కాల్చాలని పేర్కొంది.
 The Supreme Court on Tuesday permitted, across the country, the sale and manufacture of “green” firecrackers which have low emission. These crackers must fall within the noise pollution limits set in the July 2005 verdict.
 బాణాసంచాపై నిషేధం విధించాలనే పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు తయారీదారుల ఉపాధి హక్కుతో పాటు దేశం‍లోని 130 కోట్ల మంది ఆరోగ్యంగా జీవించే హక్కు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు గతంలో పేర్కొంది.

 Last October, the Supreme Court suspended the sale of firecrackers in Delhi-NCR till November 1
 రాజ్యాంగంలో ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు అందరికీ సంబంధించినది కావడంతో బాణాసంచాపై దేశవ్యాప్త నిషేధం విధించే క్రమంలో సమతూకం పాటించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.
 ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బాణాసంచా పేలుళ్లతో ప్రజలపై పడుతున్న ప్రభావం వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.
 తమిళనాడులో 1750 బాణాసంచా తయారీ పరిశ్రమలున్నాయని, వీటిలో 5000 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయని కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

ధర్మాసనం A bench comp rising Justices AK Sikri and Ashok Bhushan

నియామకాలు

డీఆర్‌డీఎల్ డెరైక్టర్‌గా డాక్టర్ దశరథరాం
 హైద‌రాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీస్ (డీఆర్‌డీఎల్) డెరైక్టర్‌గా డాక్టర్ దశరథరాం నియమితులయ్యారు.
 ఇప్పటివరకు డెరైక్టర్‌గా కొనసాగిన ప్రముఖ శాస్త్రవేత్త ఎం.ఎస్.ఆర్.ప్రసాద్ రక్షణ రంగంలో కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టం (mss)కు డెరైక్టర్ జనరల్‌గా బదిలీ అయ్యారు.
 ఆయన స్థానంలో డాక్టర్ దశరథరాం కొత్తగా బాధ్యతలు స్వీకరించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావు
 కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కలిక డైరెక్టర్‌గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని జయశంకర్‌ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్‌నర్సాపూర్ గ్రామం.
 1986వ బ్యాచ్‌ ఒడిశా కేడర్‌ ఐపీఎస్‌ అధికారి .
 సీబీఐ డైరక్టర్‌గా అలోక్ వర్మను తొలగిస్తూ ఆ స్థానంలో నాగేశ్వర రావును నియామకం .

‘వాదా’ యాప్ ప్రారంభం
 వాదా’- ఓటర్ యాక్సెస్‌బిలిటీ యాప్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్
 హైదరాబాద్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ‘వాదా’ను అక్టోబర్ 23న ప్రారంభించారు.
 కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఓపీ రావత్.
 వాదా అనగా – హామీ అనే అర్థమొచ్చేలా ఈ పేరు పెట్టారు.
 ఓటర్ చైతన్య రథాలు, గర్భిణులు, 65 ఏళ్లు దాటిన వయోధికులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ఈ యాప్ ద్వారా అధికారులు సహాయమందిస్తారు.

దేశంలోనే ప్రథమంగా బ్రెయిలీ లిపిలో ఓటరు కార్డులు
 దేశంలోనే ప్రథమంగా అంధుల కోసం బ్రెయిలీ లిపిలోనూ ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల (ఎపిక్)ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసింది.
 ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ కొందరు దివ్యాంగులకు ఈ బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డులను పంపీణి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 బ్రెయిలీ లిపిలో ముద్రించిన కరపత్రాలు, మూగ, బధిరులకు అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజితో రూపొందించిన చిత్రాల సీడీలను రావత్ ఆవిష్కరించారు.
 ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, వీవీఎస్ లక్ష్మణ్‌లతో ఈసీ ఈ చిత్రాలు రూపొందించింది.
 ఈ చిత్రాలు, కరపత్రాల్లో పోలింగ్ కేంద్రంలో ఎలా ఓటు వేయాలి.. ఈవీఎం మెషీన్లను ఎలా వాడాలి వంటి త దితర వివరాలున్నాయి.

ఐకాన్లుగా దివ్యాంగ సెలబ్రిటీలు..
 వివిధ రంగాల్లో సెలబ్రిటీలుగా ఉన్న 9 మంది దివ్యాంగులు ఐకాన్లుగా ఎన్నికల సంఘంతో కలిసి పనిచేసేందుకు సమ్మతి తెలిపారు.
 వీరిలో అంధత్వ దివ్యాంగులైన గాయని శ్రావ్య, అంతర్జాతీయ క్రికెటర్లు మహేందర్ వైష్ణవ్, జి.మధు, ఐటీ డెవలపర్ అనీస్ సుల్తానా, రేడియో జాకీ టి.వెంకటేశ్, బధిర దివ్యాంగులు నటి అభినయ, ఆర్థోపెడిక్‌కు సంబంధించి సైంటిస్ట్ (ఆర్ అండ్ డీ) థాండర్ బాబూ నాయక్, బారియర్ ఫ్రీ కంపెయినర్ నర్సింగ్‌రావు, టీవీ యాంకర్ సుజాత వీరిలో ఉన్నారు.
 ఓటరు జాబితా ప్రకారం (TS )రాష్ట్రంలో 4,12,098 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు.

కిలిమంజారో’ అధిరోహించిన పాలమూరు వైద్యుడు
 ఆఫ్రికా ఖండంలో ఎత్తై శిఖరం కిలిమంజారోని మహబూబ్‌నగర్‌లోని సుశ్రుత ప్రజావైద్యశాల ఎండీ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అక్టోబర్ 22న అధిరోహించారు.
 మహబూబ్‌నగర్ ట్రెక్కింగ్ క్లబ్ తరఫున ‘మహబూబ్‌నగర్ బాలికలను రక్షించాలి’ అనే నినాదంతో ఆయన కిలిమంజారోని అధిరోహించారు.
హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా సఫాయివాలాలు
 రైల్వే శాఖలో పనిచేసే ‘సఫాయి వాలా’ల పేరును ‘హౌస్ కీపింగ్ స్టాఫ్’గా మారుస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ అక్టోబర్ 22న ఉత్తర్వులు జారీ చేసింది.
 ఇకపై వీరిని ప్రతి విభాగం, శాఖతో కలిపి హౌస్ కీపింగ్ అసిస్టెంట్‌లుగా సంబోధించాల్సి ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.
 వైద్య, పర్యవేక్షక, తదితర విభాగాల్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేసే గ్రూప్-డీ ఉద్యోగులే సఫాయి వాలాలు.

బెంగళూరులో మెన్ టూ ఉద్యమం ప్రారంభం
 మహిళలపై లైంగిక వేధింపుల నిరసన ఉద్యమం ‘మీ టూ’ తరహాలో ‘మెన్ టూ (పురుషులు కూడా)’ ఉద్యమం ప్రారంభమైంది.
 2017లో ఒక లైంగిక వేధింపుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన మాజీ ఫ్రెంచ్ రాయబారి పాస్కల్‌మాజురి సహా ఓ 15 మంది కలిసి ఈ ఉద్యమాన్ని బెంగళూరులో అక్టోబర్ 21న ప్రారంభించారు.
 మహిళల చేతుల్లో లైంగిక వేధింపులకు గురవుతున్న పురుషుల గొంతుకగా ఇది నిలవనుందని ఈ ఉద్యమాన్ని ప్రారంభించినవారు చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా అన్‌రిజర్వ్‌డ్ రైల్వే టికెట్ల కొనుగోలు
 అన్‌రిజర్వ్‌ డ్ రైల్వే టికెట్లను యూటీఎస్ (అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్)మొబైల్ యాప్ ద్వారా కొనుగోలు చేసే సదుపాయాన్ని నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే శాఖ అక్టోబర్ 23న ప్రకటించింది.
 ఈశాన్య సరిహద్దు, పశ్చిమ మధ్య రైల్వే జోన్లలో మినహా మిగిలిన 15 జోన్లలో ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉంది.
 ప్రయాణికుల సౌకర్యార్దం రైల్వే శాఖ నాలుగేళ్ల క్రితం ముంబైలో ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది.
 ఈ యాప్ ద్వారా ఫ్లాట్‌ఫాం టికెట్లు, నెలవారీ పాసులను కూడా కోనుగోలు చేయవచ్చు.

ప్రధాని మోదీకి శాంతి పురస్కారం
2018-సియోల్‌ శాంతి పురస్కారం ప్రకటించిన కొరియా
 ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్షిణకొరియా ప్రతిష్టాత్మక సియోల్‌ శాంతి పురస్కరాన్ని ప్రకటన.
 అంతర్జాతీయ సహకారం, అభివృద్ధిలో కృషి చేసినందుకు 2018 ఏడాదికి .
 భారత్‌ను అభివృద్ధి బాట పట్టించిన మోదీ.. ప్రపంచ శాంతికై పనిచేశారనీ, భారత్‌లో మానవ వనరుల అభివృద్ధితో ‘మోదినామిక్స్‌’ చేశారని సియోల్‌ శాంతి పురస్కార కమిటీ వెల్లడి.
 భారత్‌లో అవినీతి కట్టడికి ప్రధాని మోదీ కృషి చేశారనీ, నోట్ల రద్దు వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారని అవార్డు కమిటీ తెలిపింది.
 1990లో 24వ ఒలింపిక్‌ క్రీడలను సియోల్‌లో విజయవంతంగా నిర్వహించిన దానికి గుర్తుగా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. మోదీకి ఇవ్వనున్న ఈ అవార్డు 14 వది.
 కోఫి అన్నన్‌, జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మోర్కెల్‌ .
సామాజిక సేవకు ఇన్ఫోసిస్‌ పురస్కారాలు
 సామాజిక రంగంలో మార్పుల కోసం శ్రమించే వారికి ఏటా పురస్కారాలు అందించాలని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ నిర్ణయించింది.
 ఇందు కోసం రూ.1.50 కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్లు సంస్థ అధ్యక్షురాలు సుధామూర్తి ప్రకటించారు.
 సామాజిక సేవకులను గుర్తించి ఎంపిక చేసేందుకు బెంగళూరు ఐఐఎం ఆచార్యుడు త్రిలోచనశాస్త్రి, ప్రముఖ శాస్త్రవేత్త అరవింద్‌ గుప్తా, హైదరాబాద్‌ ఐఐటీ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అధ్యాపకుడు జీవీవీ శర్మ, హైదరాబాద్‌ ఐఐఎం అతిథి అధ్యాపకుడు ఆచార్య అనిల్‌ గుప్తాలతో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఫాలీ ఎస్ నారిమన్‌కు లాల్‌బహదూర్ శాస్త్రి అవార్డు
 న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్‌కు లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ ఎక్స్‌ లెన్స్ అవార్డు-2018 లభించింది.

ఎర్రకోటలో శిలాఫలకం ఆవిష్కరణ
 నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ ‘ఆజాద్ హింద్’ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 21న ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
 విపత్తు సమయంలో సహాయక కార్యక్రమాల్లో విశేష సేవలందించే సిబ్బందికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట ఇకపై ఏటా అవార్డు ఇస్తామని మోదీ ప్రకటించారు.
 ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యులు బ్రిటిష్ పాలకుల చేతిలో విచారణ ఎదుర్కొన్న ఎర్రకోటలోని జైలుగది సంఖ్య 3లో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయనున్నారు.
 అదే జైలులో ఒక మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు.
 జాతీయ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో మోదీ పోలీసు స్మారకాన్ని ఆవిష్కరించారు. 2002లో ఈ స్మారక నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది.

దేశంలోనే తొలి ‘సొరంగ’ రైల్వే స్టేషన్‌
 భారత్‌–చైనా సరిహద్దులో నిర్మించబోతున్న వ్యూహాత్మకంగా కీలకమైన బిలాస్‌పూర్‌–మనాలి–లేహ్‌ రైల్వే మార్గంలో దేశంలోనే తొలిసారిగా సొరంగంలో రైల్వే స్టేషన్‌ను ఏర్పాటుచేయనున్నారు.
 హిమాచల్‌ప్రదేశ్‌లోని కీలాగ్‌లో
 దేశంలో సొరంగంలో ‘మెట్రో’ స్టేషన్లు ఉన్నా.. సొరంగంలో తొలి ‘రైల్వే స్టేషన్‌’ మాత్రం ఇదేకానుంది.
 ‘బిలాస్‌పూర్‌–మనాలి–లేహ్‌ మార్గంలో జరిపిన తొలి సర్వే ప్రకారం..కీలాగ్‌ స్టేషన్‌ను సొరంగంలో
 27 కి.మీ పొడవైన సొరంగంలో ఏర్పాటయ్యే కీలాగ్‌ స్టేషన్‌ సముద్ర మట్టానికి 3 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. 465 కి.మీ పొడవైన ఈ లైను నిర్మాణానికి రూ.83,360 కోట్లువ్యయం అవుతుందని అంచనా.
 ఈ లైను భద్రతా బలగాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుంది.

గుర్తు తెలియని విరాళాలపై పరిమితి
 పారదర్శకతను తీసుకురావడం కోసం గుర్తు తెలియని విరాళాలపై పరిమితి విధించాలని , ప్రస్తుతం ఉన్న పరిమితిని రూ.20వేల నుంచి రూ.2,000లకు తగ్గించాలని ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
 గతవారం ఈసీ..న్యాయ మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో రూ.2000 వరకు విరాళాలను మాత్రమే నగదు రూపంలో పార్టీలు స్వీకరించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం ముందుంచగా కేంద్రం దానికి ఆమోదం తెలిపింది. అలాగే పేరు తెలియని వ్యక్తులనుంచి వచ్చే విరాళాలపై పరిమితి విధించాలన్న డిమాండ్ ను మాత్రం పెండింగ్‌లో ఉంచింది.
 గుర్తు తెలియని విరాళాల మీద పరిమితి విధించేలా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 29సీ సెక్షన్‌ను సవరించాలని 2017లో ఈసీ కేంద్రానికి లేఖరాసింది. అయితే దీనికి సంబంధించి రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఎటువంటి నిషేధాలు లేవు. కానీ 29సీలో మాత్రం పరోక్ష నిషేధం ఉంది. అది కూడా రూ.20,000 పైబడిన విరాళాలకు మాత్రమే.
#మీటూ : ఎంజె అక్బర్‌ రాజీనామా
 పనిప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులపై వెల్లువెత్తిన ఉద్యధమంలో #మీటూ
 లైంగిక వేధింపుల ఆరోపణల్ ఎదుర్కొన్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ పదవికి రాజీనామా
మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కన్నుమూత
 ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కన్నుమూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా కూడా సేవలు అందించారు.
 మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా (1976-77, 1984-85, 1988-89)
 2002 నుంచి 2007 వరకూ ఉత్తరాఖండ్‌ సీఎంగా సేవలందించారు.
 రాజీవ్‌ గాంధీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు.

ప్రైవసీ యాజ్ సీక్రసీ పుస్తకావిష్కరణ
 కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు రచించిన ‘ప్రైవసీ యాజ్ సీక్రసీ’ పుస్తకంను న్యూఢిల్లీలో ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ ఆవిష్కరించారు.
ఘోర రైలు ప్రమాదంలో 61 మంది మృతి
 పంజాబ్‌లోని అమృత్‌సర్ నగర శివార్లలో అక్టోబర్ 19న ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
 జోడా ఫాటక్ అనే గ్రామ సమీపంలో ప్రజలు రైలు పట్టాలపై నిల్చుని దగ్గరలోని మైదానంలో జరుగుతున్న రావణ దహన కార్యక్రమాన్ని చూస్తుండగా.. జలంధర్ నుంచి అమృ18102018 pdf partత్‌సర్ వస్తున్న రైలు పట్టాలపై ఉన్న ప్రజలను ఢీకొంటూ వేగంగా దూసుకెళ్లింది.
 ఈ ప్రమాదంలో 61 మంది మృతి చెందగా మరో 72 మందికి పైగా గాయపడ్డారు.

ఎకానమీ
కోటీశ్వరులు ఎంత శాతం పెరిగారో తెలుసా?
 ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యక్తిగత పన్నులు చెల్లిస్తున్నవారు .
 ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ (సిబిడిటి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో కరోడ్‌ పతిల సంఖ్య భారీ పెరుగుదలను నమోదు చేసింది.
 సీబీడీటీ ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర
 గత నాలుగేళ్లలో 1.40లక్షల మంది పెరిగారు.
 కోటి పైగా సంపాదిస్తున్నవారి సంఖ్య సుమారు 60శాతం పెరుగుదలను నమోదు.
 గత నాలుగేళ్లలో ఆదాయపు పన్ను, ప్రత్యక్ష పన్నులచెల్లింపుల గణాంకాలను సీబీడీటీ సోమవారం ప్రకటించింది.
 ఆదాయ పన్ను శాఖ తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా గత మూడేళ్లలో పన్ను చెల్లింపు దారుల నమోదు భారీగా పెరిందని తెలిపారు.
 కోటి రూపాయల ఆదాయాన్ని చూపిస్తూ (కార్పొరేట్లు, సంస్థలు, హిందూ డివైడెడ్‌ ఫ్యామిలీస్‌ తదితరులు) ఆదాయపన్ను చెల్లిస్తున్నవారి మొత్తం సంఖ్య ఏటా 68 శాతం.
 కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య 55 శాతం వృద్ధిని నమోదు చేసింది.
 2014-15 లో రూ. 32.28 లక్షల తో పోలిస్తే ప్రస్తుత ఏడాదిలో సగటు పన్ను రూ .49.95 లక్షలకు పెరిగింది.
 సాలరీడ్‌ టాక్స్‌ పేయర్స్‌ సంఖ్య 37శాతం పెరిగింది.
అలాగే నాన్‌ సాలరీడ్‌ టాక్స్‌ పేయర్స్‌ సంఖ్య్ 19శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువ : మూడీస్
 బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అక్టోబర్ 22న వెల్లడించింది.
 మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది.
 మార్కెట్లో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు అధికంగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత దెబ్బతింటోందని పేర్కొంది.
 బ్రెజిల్, దక్షిణాఫ్రికా బ్యాంకులు అసెట్స్‌పై అత్యధిక రాబడులు నమోదు చేస్తున్నాయని వివరించింది.
 బ్రిక్స్ కూటమిలో భారత్ సహా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి.
మొండిబాకీల్లో రెండో స్థానం…
 మొండిబాకీల విషయంలో బ్రిక్స్ కూటమిలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు మూడీస్ వెల్లడించింది.
2017 ఆఖరు నాటికి నిరర్ధక రుణాల నిష్పత్తి (ఎన్‌పీఎల్) రష్యన్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, చైనా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు కమిటీ
 భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు, ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థను అధ్యయనం చేసి విప్లవాత్మక అభివృద్ధి ఎజెండాను రూపొందించేందుకు నీతిఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్‌ పనగరియా చొరవ.
 ‘ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి లోతైన పరిశోధన, అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశామ’ని పనగరియా తెలిపారు.

దేశంలోనే తొలి క్రిప్టో కరెన్సీ
 బెంగళూరులో దేశంలోనే తొలి క్రిప్టో కరెన్సీ ఏటీఎం కియోస్క్‌ ఏర్పాటైంది.
 రాజాజీ నగర్‌లోని యునోకాయిన్‌ టెక్నాలజీస్‌ సంస్థ కెంప్‌ఫోర్ట్‌ మాల్‌లో దీన్ని ఏర్పాటుచేసింది.
 ఈ ఏటీఎం ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా బిట్‌కాయిన్లను భారతీయ కరెన్సీగా మార్చుకోవచ్చు.
 బిట్‌కాయిన్లపై భారత్‌లో నిషేధం ఉంది.
 బిట్‌కాయిన్లతో వస్తువులను కొనాలంటే సమస్యలు వస్తుండటంతో పరిష్కారంగా క్రిప్టోకరెన్సీ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చినట్లు యునోకాయిన్‌ టెక్నాలజీస్‌ అధికారులు చెప్పారు.
 నగదు డిపాజిట్, విత్‌డ్రాకు సంబంధించి దేశంలో అమల్లో ఉన్న నిబంధనలకు లోబడే ఈ ఏటీఎం పనిచేస్తుంది.

క్రీడలు
వన్డే క్రికెట్‌లో పది వేల పరుగులు పూర్తి చేసిన విరాట్
 భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వన్డే క్రికెట్‌లో పది వేల పరుగులు పూర్తి చేశాడు.
 విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్-వెస్టిండీస్‌ల మధ్య అక్టోబర్ 24న జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు.
 కెరీర్‌లో 37వ శతకం చేసిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
పదివేల పరుగులు చెరే క్రమం లో —
 213 మ్యాచ్‌లు, 205 ఇన్నింగ్స్‌ లలో కోహ్లి మొత్తం 10,076 పరుగులు చేశాడు.
 10 వేల పరుగులు చేసిన 13వ ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
 అతి తక్కువ ఇన్నింగ్స్‌ లలో (205) పది వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగా కోహ్లి కొత్త రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్‌) పేరిట ఈ ఘనత ఉంది.
 అరంగేట్రం చేసిన నాటి నుంచి అతి తక్కువ రోజుల్లో 10 వేలు మైలురాయిని చేరింది కూడా కోహ్లినే.10 ఏళ్ల 67 రోజుల్లో ఈ ఘనత సాధించాడు.(ద్రవిడ్‌10 ఏళ్ల 317 రోజులు)
 10 వేల కోసం ఎదుర్కొన్న బంతులను చూసినా కోహ్లిదే రికార్డు. జయసూర్య 11,296 బంతులు ఆడితే కోహ్లికి 10,813 మాత్రమే సరిపోయాయి.
 అత్యధిక పరుగులు చేసింది – టెండూల్కర్ (18,426)

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కు రజతం
 ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ బజరంగ్ పూనియాకి రజత పతకం .
 హంగేరి రాజధాని బుడాపెస్ట్‌ లో జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 24 ఏళ్ల బజరంగ్ (హరియాణా) 9-16 పాయింట్ల తేడాతో టకుటో ఒటోగురో(జపాన్) చేతిలో ఓడి రజతం దక్కించుకున్నాడు.
 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా గుర్తింపు.
 2013లో బుడాపెస్ట్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
 ఇప్పటివరకు భారత్ తరఫున సుశీల్ కుమార్ (66 కేజీలు; 2010లో) ఒక్కడే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు.

యూత్ ఒలింపిక్స్‌ లో భారత్‌కు 17వ స్థానం
 ఓవరాల్‌గా ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 13 పతకాలు సాధించి 17వ స్థానంలో నిలిచింది.
 2010 క్రీడల్లో భారత్ 8 పతకాలతో 58వ స్థానంలో… 2014 క్రీడల్లో రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది.
 2022 యూత్ ఒలింపిక్స్ సెనెగల్‌ లో జరుగుతాయి.

S&T
బ్రహ్మోస్‌కు పోటీగా చైనా కొత్త క్షిపణి
 భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ క్షిపణికి పోటీగా చైనాలోని ఓ మైనింగ్‌ సంస్థ సూపర్‌సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు గ్లోబల్‌ టైమ్స్‌ మీడియా పేర్కొంది.
 ఈ క్షిపణిని చైనా మిత్రదేశం పాకిస్తాన్‌ కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
 హెచ్‌డీ–1 అని పేరుపెట్టిన ఈ క్షిపణిని హోంగ్డా సంస్థ తన సొంత ఖర్చుతో అభివృద్ధి చేస్తోంది.
 ప్రభుత్వం ఆమోదించాక హోంగ్డా కంపెనీ ఈ క్షిపణిని ఇతర దేశాలకు అమ్మనుంది.

క్షయ వ్యాధికి నూతన చికిత్సా విధానం
 మందులకు లొంగకుండా ప్రపంచంలోని అనేక మందిని వేధిస్తున్న క్షయ వ్యాధికి నూతన చికిత్సా విధానాన్ని బెలారస్‌కి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
 ఈ మేరకు అక్టోబర్ 21న నిర్వహించిన పరీక్షల్లో ఈ నూతన విధానం సత్ఫలితాలను అందించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
 నూతన విధానం ద్వారా ప్రస్తుత వ్యాధిగ్రస్తుల్లో 80 శాతం మందికి క్షయ వ్యాధిని శాశ్వతంగా దూరం చేయవచ్చు.
 ప్రస్తుతమున్న చికిత్సా విధానం ద్వారా 55 శాతం మందికే క్షయ వ్యాధిని తగ్గించవచ్చు. ఈ చికిత్సలో బెడాక్విలైన్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు.

కృత్రిమ చందమామ
 పట్టణాల్లో పెను భారమవుతున్న వీధి దీపాల అవసరాన్ని తప్పించేందుకు చైనా పరిశోధకులు కృత్రిమ చందమామల పేరుతో ప్రకాశవంతమైన ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తున్నారు.
 అసలైన జాబిల్లి కన్నా ఇవి 8 రెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి.
 సిచువాన్‌ ప్రావిన్స్‌లోని చెంగ్డు నగరంలో ఈ కృత్రిమ చందమామ వెలుగులను పంచనున్నారు.
 దీనికింద మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని సిచువాన్‌లోని అంతరిక్ష కేంద్రం నుంచి పంపుతారు.
 అది సాఫీగా పనిచేస్తే 2022లో మరో 3 ఉపగ్రహాలను ప్రయోగిస్తారు.
 ఈ మూడింటివల్ల పౌర, వాణిజ్య రంగాల్లో అనేక ప్రయోజనాలు ఉంటాయని చైనా పరిశోధకులు.
 సూర్యకాంతిని పరావర్తనం చెందించడం ద్వారా నిజ చందమామ వెలుగులీనుతుంది. మానవ నిర్మిత జాబిలి కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. సూర్యుడి కాంతిని భూమి వైపునకు ప్రసురింపచేస్తుంది.ఈ చందమామలు 50 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వెలుగులు నింపుతాయనుకుంటే ఏటా 17 కోట్ల డాలర్లమేర విద్యుత్‌ ఆదా అవుతుందని అంచనా. విపత్తు సమయాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయినప్పుడు రాత్రివేళ సహాయ చర్యలకు ఇవి సాయపడతాయి.
 రష్యా శాస్త్రవేత్తలు కూడా 1990లలో ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టినట్లు వార్తలు వచ్చాయి.
బుధుడిపైకి రెండు వ్యోమనౌకలు – విజయవంతంగా ప్రయోగించిన ఐరోపా, జపాన్‌
సూర్యుడికి అతిదగ్గరగా ఉన్న బుధుడిపైకి ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈఎస్‌ఏ), జపాన్‌ అంతరిక్ష అన్వేషణ సంస్థ(జేఏఎక్స్‌ ఏ) సంయుక్తంగా రెండు వ్యోమనౌక(ప్రోబ్‌)లను విజయవంతంగా ప్రయోగించాయి.
 ఈఎస్‌ఏ తయారుచేసిన ‘బెపి’, జేఏఎక్స్‌ ఏ రూపకల్పన చేసిన ‘మియో’లను అరియన్‌ 5 రాకెట్‌ ద్వారా ఫ్రెంచి గయానాలోని కౌరు నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించారు.
 వీటిని మోసుకుపోయిన అంతరిక్షనౌకకు 20వ శతాబ్దపు ఇటలీ గణితశాస్త్రవేత్త, ఇంజినీరు ‘గియుసేప్‌ బెపి కొలంబో’ గౌరవార్థం ‘బెపికొలంబో’గా నామకరణం చేశారు.
 శాస్త్రవేత్తలు అనుకున్నట్లే రెండు ప్రోబ్‌లు కచ్చితమైన సమయంలో వ్యోమనౌక నుంచి విడివడి, నిర్దేశిత కక్ష్యల దిశగా సాగుతున్నాయి.
 మొదటి సంకేతాన్ని కూడా పంపించాయి.
 డిసెంబరు 2025నాటికి నిర్దేశిత ప్రాంతానికి చేరతాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
 బుధుడి ఉపరితలం, అయస్కాంతక్షేత్రాలపై అధ్యయనమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రూ.110 కోట్లు వ్యయం చేస్తున్నారు.
 బుధుడి అంతర్గత కక్ష్య గురించిన సమాచారాన్ని బెపి; గ్రహం అంతర్గత నిర్మాణం, ఉపరితలం, భూభౌతిక పరిణామానికి సంబంధించిన విషయాలపై మియో వివరాలు పంపించనున్నాయి.
ప్రయోగం ఉద్దేశ్యం :-
చంద్రుడితో పోలిస్తే కాస్త పెద్దదైన బుధుడి కేంద్రంలో ఇనుము ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ ఉన్న ద్రవాల గురించి శాస్త్రవేత్తలకు పెద్దగా సమాచారం లేదు. సౌరవ్యవస్థ పుట్టుపూర్వోత్తరాల గురించి కూడా తాజా ప్రయోగంతో కొత్త వివరాలు వెలుగులోకి రావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఉపగ్రహాలు ఏడాదిపాటు క్షక్ష్యలో పరిభ్రమిస్తాయి.

అనూహ్య వాతావరణం
 సూర్యుడికి బుధుడు అతిదగ్గరగా ఉండటం వల్ల అక్కడి వాతావరణం అనూహ్యంగా ఉంటుంది.
 పగటి ఉష్ణోగ్రతలు 400 డిగ్రీల సెల్సియస్‌ పైన ఉంటే, రాత్రిపూట మైనస్‌ 170 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది.
 1973లో నాసా ప్రపంచంలోనే మొదటిసారిగా బుధుడిపైకి ప్రయోగించిన ‘మరినెర్‌ 10 ప్రోబ్‌’ ఆ గ్రహం ఉపరితలాన్ని 45శాతం వరకు చిత్రీకరించగలిగింది.
 మిగిలింది తెలుసుకోవడానికి 2004లో మెసెంజర్‌ను ప్రయోగించింది.

రాష్ట్రీయం వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ ప్రారంభం
 వైజాగ్ ఫిన్‌టెక్ ఫెస్టివల్ విశాఖపట్నంలో అక్టోబర్ 23న ప్రారంభమైంది.
 రాజధాని అమరావతిని ప్రపంచంలోనే మేటి ఐటీ సిటీగా, నాలెడ్జి నగరంగా, తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ హబ్‌గా తయారు చేస్తామని ,
 ప్రపంచస్థాయి ఫిన్‌టెక్ సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించేందుకు వీలుగా ప్రతి సంవత్సరం ‘వన్ మిలియన్ డాలర్ ఛాలెంజ్’ (రూ. 7 కోట్లు) పోటీలను నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
 కార్యక్రమంలో 15 దేశాల నుంచి 1,800 మంది ఐటీ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

పైవసీమిర్చి ఎయిర్‌పోర్ట్ రేడియో సర్వీసులు ప్రారంభం
 హైదరాబాద్‌లోని రాజీవ్‌గాందీ అంతర్జాతీయం విమానాశ్రయం (శంషాబాద్ విమానాశ్రయం)లో మిర్చి ఎయిర్‌పోర్ట్ రేడియో సర్వీసులు ప్రారంభమయ్యాయి.
 దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ప్యాసింజర్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద ఈ రేడియో సర్వీసులను జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ (జీహెచ్‌ఐఎల్) ప్రారంభించింది.
 విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఈ రేడియో సేవలు అందుబాటులో ఉంటాయి.

విజయవాడలో అంతర్జాతీయ పడవ పోటీలు
 నవంబర్ 16, 17, 18 తేదీల్లో విజయవాడ కృష్ణా నదిలో అంతర్జాతీయ పడవ పోటీలు నిర్వహించనున్నారు.
 పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా నవంబర్ నెలలో విజయవాడలో మూడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
 ఇందులో భాగంగా అంతర్జాతీయ పడవ పోటీలను పున్నమిఘాట్‌లో నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కరెంట్ అఫైర్స్ అక్టోబర్ (18 to25)
 నవంబర్ 23-25 వరకు పున్నమిఘాట్‌లో అమరావతి ఎయిర్‌షోను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.కరెంట్ అఫైర్స్ అక్టోబర్ (18 to25)కరెంట్ అఫైర్స్ అక్టోబర్ (18 to25)