గ్రామ సచివాలయాల ఉద్యోగ వివరాలు -ఏర్పాటుకు కీలక ఉత్తర్వులు (G.O)జారీ-నియామక Tentative టైం లైన్-

వాటిలో పనిచేసేందుకు కొత్తగా 91,652 మంది ఉద్యోగుల నియామకం 

అక్టోబర్‌ 2 నుంచి అమల్లోకి నూతన వ్యవస్థ 

పంచాయతీలకు బదలాయించబడిన 29 రకాల అధికారాలను సదరు పంచాయతీలే సమర్థవంతంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు.. ప్రస్తుతం పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న వారు కాకుండా కొత్తగా 91,652 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు .

పంచాయతీలకు బదలాయించబడిన 29 రకాల అధికారాలను సదరు పంచాయతీలే సమర్థవంతంగా నిర్వహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఏర్పాటయ్యే గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు.. ప్రస్తుతం పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న వారు కాకుండా కొత్తగా 91,652 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు .

సచివాలయ కన్వీనర్‌ గా పంచాయతీ కార్యదర్శి 

  •   గ్రామ సచివాలయాలలో పనిచేసే ఉద్యోగులందరికీ గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనాభా సంఖ్య ఆధారంగా కొన్నిచోట్ల రెండు లేక అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు ఒక గ్రామ సచివాలయం యూనిట్‌గా గ్రామ కార్యదర్శి, అతనికి అనుబంధ సిబ్బంది పనిచేస్తారని ఉత్తర్వులో పేర్కొన్నారు.
  • కొన్ని పెద్ద గ్రామ పంచాయతీల్లో రెండు కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలు ఏర్పాటవుతాయని, వాటిలోనూ పూర్తిస్థాయి సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు.
  • ఈ మేరకు రాష్ట్రంలో గల 13,065 గ్రామ పంచాయతీలను 11,114 గ్రామ సచివాలయాలుగా వర్గీకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
  • 2 వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండే గ్రామ పంచాయతీల్లో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తారు.
  • 2 వేల లోపు జనాభా ఉన్నచోట వీలును బట్టి రెండు మూడు పంచాయతీలకు కలిపి ఒకే గ్రామ సచివాలయ యూనిట్‌ సిబ్బంది పనిచేస్తారని పేర్కొన్నారు.
  • 4వేలకు పైబడి జనాభా ఉన్న ఒకే గ్రామ పంచాయతీలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వివరించారు.
  •  గిరిజన ప్రాంతాల్లో 2వేల కంటే తక్కువ జనాభా ఉన్నచోట ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు

రెండేళ్ల పాటు రూ.15 వేలు జీతం.. తర్వాత రెగ్యులరైజేషన్‌

  • గ్రామ సచివాలయాల్లో పని చేయడానికి ప్రభుత్వం కొత్తగా నియమించే ఉద్యోగులకు మొదటి రెండేళ్ల పాటు ప్రొబెషనరీ పీరియడ్‌గా భావించి, ఆ కాలంలో నెలకు రూ.15 వేల చొప్పున స్టైఫండ్‌ రూపంలో వేతనంగా చెల్లిస్తారు.
  • రెండేళ్ల తర్వాత వివిధ శాఖల నిబంధనల మేరకు వారిని రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
  • గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల పనితీరును సమీక్షించడానికి మండల, జిల్లా స్థాయి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంటుంది.