జాతీయ అంశాలు – కరెంట్ అఫైర్స్

31102018

జాతీయ అంశాలు
 ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్మారకార్థం గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ‘ఐక్యతా విగ్రహం– స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఆవిష్కరణ
 పటేల్‌ జయంతి సందర్భంగా 31.10.2018 ప్రధాని మోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం .
 నర్మదా జిల్లాలోని ,కేవడియా లో (సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ సమీపంలో ఉన్న సాధు బెట్‌లో) ఈ విగ్రహాన్ని నిర్మించారు.
 ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటుచేసిన ఈ విగ్రహం 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినది.
 ప్రఖ్యాత ‘స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ’ కంటే ఇది రెట్టింపు పొడవు.
 చైనా లోని స్ప్రింగ్ టెంపుల్ – బుద్ధ – 153 మీటర్స్
 వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు

3010.2018
హిస్టరీ, పాలిటి, ఎకానమీ, విపత్తు నిర్వహణ , సుస్తిరాభి వృద్ది ,జాగ్రఫీ
పుస్తకాల కోసం :-
https://www.amazon.in/shop/groupschannelappsctspsc

ఇకపై ఆధార్‌ సేవా కేంద్రాలు
• పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల తరహాలో దేశవ్యాప్తంగా ఆధార్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది.
• ఆధార్‌ సేవా కేంద్రాల్లో ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
• ఆధార్‌ కార్డుల రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన అనంతరం యూఐడీఏఐ ఈ మేరకు సన్నాహాలు చేపట్టింది.
• రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఆధార్‌ నిబంధనలున్నాయని గతంలో అప్పటి సర్వోన్నత న్యాయస్ధానం ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
• అయితే ఆధార్‌ను బ్యాంకింగ్‌, మొబైల్‌ సేవలు, స్కూల్‌ అడ్మిషన్లకు అనివార్యం చేయరాదని పేర్కొంది. ఆధార్‌తో పాన్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిం‍ది.
• పౌరుల ఆధార్‌ వివరాలను ప్రైవేట్‌ కంపెనీలు కోరరాదని తేల్చిచెప్పింది.

రైళ్లలో ధ్రువీకరణకు లాయర్‌ ఐడీ కార్డులు
o రైలు ప్రయాణాల్లో గుర్తింపు ధ్రువీకరణ పత్రం(ఐడెంటిటీ ప్రూఫ్‌)గా న్యాయవాదులు తమకు ఆయా బార్‌ కౌన్సిల్స్‌ జారీ చేసే ఐడెంటిటీ కార్డులను ఉపయోగించుకోవచ్చు.
o ఇప్పటివరకు 11 రకాల ధ్రువీకరణ పత్రాలను రైల్వే శాఖ గుర్తిస్తోంది.
o వాటిలో ఆధార్‌ కార్డ్, పాస్‌పోర్ట్, విద్యార్థులకు వారి పాఠశాలలు, కళాశాలలు జారీ చేసే గుర్తింపు కార్డ్‌ లు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు కార్డులు మొదలైనవి ఉన్నాయి.
o కేరళ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాల కారణంగా బార్‌ కౌన్సిల్స్‌ జారీ చేసే ఐడీ కార్డులను ధ్రువీకరణ పత్రాలుగా ఉపయోగించుకునేందుకు అవకాశమిస్తున్నామని రైల్వే బోర్డు సోమవారం ప్రకటించింది.
డిజిటల్‌ అక్షరాస్యతపై ఫేస్‌బుక్‌ శిక్షణ
• డిజిటల్‌ వ్యవహారాల్లో భద్రతపై చిట్కాలు నేర్పించేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌ ‘డిజిటల్‌ లిటరసీ లైబ్రరీ’ పేరిట ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
• తెలుగు, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శిక్షణ ఉంటుందని వెల్లడించింది.
• ఇంతవరకు వేర్వేరు మార్గాల ద్వారా ఫేస్‌బుక్‌ డిజిటల్‌ అక్షరాస్యతలో 2 లక్షల మందికి శిక్షణ.
• ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేస్తామని ఫేస్‌బుక్‌ చెప్పింది. ప్రాథమికంగా ఈ శిక్షణలో మహిళలు, యువతకు ప్రాధాన్యమిస్తామని తెలిపింది.
• పిల్లల భద్రతపై ఐఐటీ ఢిల్లీలో రెండ్రోజుల హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది.
29102018 ఎన్‌ఆర్‌ఐలూ ఆర్టీఐ దరఖాస్తు చేయొచ్చు
o విదేశాల్లో ఉంటున్న భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రభుత్వ విభాగాలను సమాచారం కోరవచ్చని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.
o ఆర్టీఐ దరఖాస్తులు చేసేందుకు ఎన్‌ఆర్‌ఐలు అర్హులు కాదని ఈ ఏడాది ఆగస్టు 8న సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభకు తెలియజేశారు.
o ఆర్టీఐ చట్టం ప్రకారం భారతీయులందరికీ ఆ అవకాశం ఉంటుందనీ, ఎన్‌ఆర్‌ఐలు కూడా భారతీయులేనంటూ లోకేశ్‌ బాత్రా అనే సామాజిక కార్యకర్త మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీంతో జితేంద్ర సింగ్‌ ఇచ్చిన సమాచారాన్ని మార్చి, ఆ సమాధానాన్ని ప్రభుత్వం మళ్లీ లోక్‌సభ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

మరో 8 నగరాల్లో ఈ–వీసాలు

ప్రపంచంలోని మరో 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది.
 ఇందులో భాగంగా ఆయా నగరాలకు చెందిన పర్యాటకులకు బయో మెట్రిక్‌ విధానంలో ఈ–వీసా మంజూరు చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది.
 ఈ 8 నగరాల్లో ఒట్టావా (కెనడా), సెయింట్‌ పీటర్స్‌బర్గ్, వ్లాడివోస్తక్‌ (రష్యా), మ్యూనిచ్‌ (జర్మనీ), బ్రస్సెల్స్‌ (బెల్జియం), ఓస్లో (నార్వే), బుడాపెస్ట్‌ (హంగేరి), జగ్రీబ్‌ (క్రొయేషియా) ఉన్నాయి.
 ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్‌ వివరాలు ఇస్తే చాలు ఈ–వీసా ఇస్తారు. భారత్‌కు వచ్చాక మళ్లీ ఈ–వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
కశ్మీర్‌లో సుశిక్షిత ఉగ్రవాద స్నైపర్లు
 స్నైపర్‌లు -సుదూరం నుంచి గురిచూసి కాల్పులు జరిపేవారు.
 కశ్మీర్‌లో ప్రస్తుతం నలుగురు సుశిక్షిత ఉగ్రవాద స్నైపర్‌లు క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది.
 జైషే మహమ్మద్‌ (జేఈఎమ్‌) ఉగ్రసంస్థకు చెందిన వీరు.. సెప్టెంబర్‌లో మన దేశంలోకి చొరబడినట్లు భారత అధికారులు తెలిపారు.
 స్థానిక మద్దతుదారుల సాయంతో పుల్వామా జిల్లాలో ఈ నలుగురు (రెండు బృందాలుగా) పాగా వేశారని పేర్కొన్నారు.
 తాజాగా త్రాల్‌లో. అనంత్‌నాగ్‌లోని నౌగామ్‌ల్లో స్నైపర్‌లు మళ్లీ దాడులు చేశారు. ముగ్గురు సైనికుల ప్రాణాలను బలితీసుకున్నారు.

అతిపొడవైన రైలు-రోడ్డు వంతెన ప్రారంభం
దేశంలోనే అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెనను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్టోబర్ 25న తెలియజేశారు.
 ‘బోగీబీల్ బ్రిడ్జ్’ గా పిలిచే ఈ వంతెనను అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల మధ్య బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నారు.
 4.94 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన అసోంలోని దిబ్రుగఢ్‌ను అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ను కలుపుతుంది.
 వంతెన కింది డెక్‌లో రెండు రైల్వే ట్రాక్‌లు, పైన డెక్‌లో మూడు వరుసల రోడ్డును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చివరి దశలో ఉండగా త్వరలో మోదీ దీనిని ప్రారంభించనున్నారు.
 2002లో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు.

వస్త్రధారణ సరిగాలేదని సీఎస్‌లకు సుప్రీం మందలింపు

వస్త్రధారణ సరిగా లేకపోవడంతో ఇద్దరు ప్రభుత్వ ప్రధాన జాతీయ అంశాలు డౌన్లోడ్కార్యదర్శులకు సుప్రీంకోర్టు మందలింపు.
 విశ్రాంత న్యాయమూర్తులకు ఆరోగ్య సదుపాయాలు కల్పించడంలో అలసత్వంపై విచారణ సందర్భం గా ధర్మాసనం సంధించిన ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు అరుణాచల్‌ ప్రదేశ్‌, గోవా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌) హాజరయ్యారు. వీరిద్దరూ చొక్కాలపై చేతుల్లేని జాకెట్లు వేసుకొచ్చారు.
 మొదటగా ఆయనకు భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం మందలించింది.
 ‘‘ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు? సుప్రీం కోర్టు ముందు ఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరయ్యేటప్పుడు కొంచెం హుందాగా ఉండే వస్త్రాలు వేసుకోవాలి’’అని వ్యాఖ్యానించింది