పంచాయతీ సెక్రటరీ మెటీరియల్

కేంద్ర ఫ్లాగ్ షిప్ పధకాల పై 100 ప్రశ్నలు

డౌన్ లోడ్ చేయండి
ఫ్లాగ్ షిప్ ౩ 100 QA

POLITY BY LAXMIKANT

స్థానిక సంస్థల ఆదాయ & వ్యయాల నిర్వహణ
వివిధ పధకాల క్రింద పొందిన నిధుల – అకౌంటింగ్ & నిర్వహణ

o గ్రాంట్స్(ఫండ్స్ ) రకాలు
o కాలానుగుణ ముదింపు ప్రోసిజర్స్
o గ్రాంట్స్ రిసిప్ట్ – రికార్డ్ – నిర్వహణ
o నగదు & చెక్స్ లను బ్యాంక్ లలో జమ
o అకౌంట్స్ నిర్వహణ
o డిమాండ్ –కలెక్షన్ –బేలన్స్ ల అప్ డేషన్
o గ్రాంట్స్ వినియోగం & వినియోగ దృ వ పత్రాల సమర్పణ
o అడ్వాన్స్ ల రికన్సిల్ & అప్ డేట్ &
o ఫైనాన్షియల్ స్టేట్ మెంట్స్ తయారీ
o అంతర్గత తనిఖీ లు

గ్రామ పంచాయితీలు కేంద్ర & రాష్ట్రాల నుండి చెప్పుకోదగ్గ రీతి
(సరిపోయినంతగా) లో వనరులను / గ్రాంట్స్ ని పొందుతాయి.

 గ్రామ పంచాయతీ పొందిన ప్రతీ గ్రాంట్ ఒక ప్రత్యేక లక్ష్యం
కి అనుగుణం గా విడుదల చేయబడి ఉంటుంది.
 ఆ గ్రాంట్ వినియోగానికి నిభందనలు ఉంటాయి.
Ex:- BRGF నిధులు – వెనుక బడిన జిల్లాల్లో అభివృద్ది లక్ష్యం

ప్రతీ గ్రాంట్ నిర్వహణ కు కావలసినవి :
 ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ ని నిర్వహించాలి
 ప్రత్యేకం గా ఒక బుక్ అఫ్ అకౌంట్స్ ని నిర్వహించాలి.
 విడతల వారీగా వినియోగ ధృవ పత్రాలు సమర్పణ.
Submission of U.Cs (Utilisation certificates)
ఉదాహరణ :- 14 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం
14 FC లో పనితీరు నిధులు విడుదల కావాలంటే UC లు సమర్పించాలి.

1 .గ్రామ పంచాయతీలు చేసే ఖర్చులపై (వ్యయాల )నియంత్రణ ఉంటుంది.
ఏదైనా ఒక ఆదాయం వస్తే దానిని అకౌంట్ లోనికి తీసుకు రావాలి.
ఒక వేళ ఏదైనా వినియోగానికి సంబంధించిన అనుమతి ఉత్తర్వు వస్తే ఆ గ్రాంట్ ను అందులోనే ఉంచడం జరగు తుంది.
2. ఈ గ్రాంట్ ని కేపిటల్ వ్యయానికి వినియోగించి .. శాశ్వత నిర్మాణాలను ఏర్పాటు చేస్తే వాటిని అకౌంట్ ఫర్ చేయాలి.

APPSC Group – III Panchayat Secretary Screening Test PRACTICE BITS [ TELUGU MEDIUM ]

పొందిన గ్రాంట్స్ ను రికార్డ్ చేయడం :-
 పొందిన గ్రాంట్స్ ను దాని యొక్క గ్రాంట్ ఉద్దేశ్యం ను కుడా రికార్డ్ చేయాలి.

  

పొందిన గ్రాంట్స్ ను రికార్డ్ చేయడం :-

 ఒక వేళ చెక్ అనేది వస్తే దానిని బ్యాంక్ లో జమ చేసేముందు రిజిస్టర్ అఫ్ చెక్స్ లో రికార్డ్ చేయాలి .
 గ్రాంట్ రిజిస్టర్ లో గ్రాంట్ ని అనుమతి చేసిన ఉత్తర్వుల వివరాలు కూడా పేర్కొనాలి .
 పంచాయతీ ఆ గ్రాంట్ యొక్క లక్ష్యాన్ని బట్టి రెవెన్యూ (లేదా)
కాపిటల్ వ్యయం గా నిర్వహించాలి .

గ్రాంట్స్ వినియోగం :- గ్రాంట్స్ ను రిసీవ్ చేసుకున్నాక ,ఏ లక్ష్యం /పని నిమిత్తం సంబంధిత గ్రాంట్ విడుదల అయ్యిందో దానికి తప్ప వేరే ఉద్దేశ్యానికి ఖర్చు చేయకుండా చూడాలి .

Ex:- గ్రాంట్ విద్యుత్ వినియోగానికి విడుదల అయితే దానిని
సెల్ ఫోన్ పేమెంట్ కు వాడడం చేయరాదు .

గ్రాంట్స్ ని ప్రధానం గా

1.ఒరిజనల్ వర్క్స్ – ఆస్తుల నిర్మాణానికి చేపట్టే పనులు
2.రిపేర్ వర్క్స్ – నిర్వహణ నిమిత్తం చేపట్టే పనులు
(అయితే ఆ గ్రాంట్ యొక్క నిభందనలు అంగీకరిస్తేనే)
3.ఇతర రెవెన్యూ/ నిర్వహణ ఖర్చులు .

 ఏ పని నిమిత్తం బ్యాంక్ అకౌంట్ ని తెరిచామో ఆ బ్యాంక్ అకౌంట్ నుండి మాత్రమే ట్రాన్సాక్షన్స్ చేపట్టాలి .
 వీటికి సంబంధించిన పన్నుల రికవరీ లను ఆ పద్దుల నుండి మాత్రమే చెల్లించాలి
 సరి అయిన స్కీం కోడ్ ను సంబంధిత ఆర్ధిక పధక కార్యకలాపానికి మూలం గా వాడాలి .
 గ్రాంట్స్ వినియోగాన్ని రిజిస్టర్ ఆఫ్ గ్రాంట్స్ లో నిర్వహించాలి .

అంతర్గత నియంత్రణలు :అకౌంట్స్ హెడ్ అఫ్ డిపార్ట్ మెంట్ మాత్రం ఏ లక్ష్యం /పని నిమిత్తం సంబంధిత గ్రాంట్ విడుదల అయ్యిందో దానికి తప్ప వేరే ఉద్దేశ్యానికి ఖర్చు చేయకుండా చూడాలి .
Ex:- గ్రాంట్ విద్యుత్ వినియోగానికి విడుదల అయితే దానిని సెల్ ఫోన్
పే మెంట్ కు వాడడం చేయరాదు .
 అకౌంట్స్ హెడ్ అఫ్ డిపార్ట్ మెంట్ మాత్రం ప్రత్యేకం గా స్కీం ప్రాజెక్ట్స్ అకౌంట్స్ ని Q1/Q2/Q3/Q4 ప్రాతిపదికన ఖర్చులను రికన్సిల్ చేయించాలి .
 అలాగే వచ్చిన గ్రాంట్స్ అన్ని గ్రాంట్ రిసివిడ్ రిజిస్టర్ లో రికార్డ్ అయ్యాయా /లేదా అని చూడాలి .
 ఇంకా రోజువారి రిసిప్ట్ వివరాలను సమాకలనం ను తయారు చేసేలా చూడాలి .
 పంచాయత్ హెడ్ కాలెండర్ అఫ్ రిటర్న్స్ /రిపోర్ట్స్ ను పర్యవేక్షణ కోసం నిర్ణయించాలి .

కాలానుగుణ ముదింపు ప్రోసిజర్స్ :- PRI ల యోక్క వార్షిక అకౌంట్స్ అనేవి ఏప్రిల్ 1 తో మొదలై మార్చ్ 31 తో ముగుస్తాయి.
 వార్షిక అకౌంట్స్ అనేవి నెల వారీ గా చేసిన అకౌంట్స్ యొక్క (కంపైల్ ) సమాహారమే వార్షిక అకౌంట్స్ .

కాలానుగుణ ముదింపు ప్రోసిజర్స్
అయితే దీనిలో
రోజు వారీగా ,నెల వారిగా &
వార్షిక పద్దతి లో ఈ ప్రోసిజర్స్ ను చేస్తారు.

రోజు వారీ చేపట్టాల్సిన ప్రోసిజర్స్ :-

నగదు పుస్తకాన్ని & బ్యాంక్ పుస్తకాన్ని రోజూ కూడి బేలన్స్ చేయాలి .
 ప్రతీ రోజు వారీ వివరాలను సంబంధిత లెడ్జర్స్ లో పోస్ట్ చేయాలి.
రోజు వారీ చేపట్టాల్సిన ప్రోసిజర్స్ :-
 ముందటి రోజున ముగింపు నిల్వలను తర్వాత రోజు కు ప్రారంభ నిల్వ గా తీసుకు పోవాలి .
నగదు బేలన్స్ ల ను ప్రత్యక్షం గా తనిఖీ చేయాలి :-
 క్యాషియర్ చేయాలి .నగదు యొక్క డినామినేషన్ & విలువ లను క్యాష్ బుక్ లో నమోదు చేయాలి .
 దీనిని సంబంధిత క్యాషియర్ & అకౌంట్ డిపార్ట్ మెంట్ హెడ్ దృవీ కరించాలి. నగదు బేలన్స్ అనేది ఈ ప్రత్యక్ష తనికీ కి మరియు నగదు పుస్తకం కి సరిపోవాలి .

నగదు & చెక్స్ లను బ్యాంక్ లలో జమ చేయాలి :-

నగదు & చెక్స్ లను బ్యాంక్ లలో జమ చేయాలి :-

 నగదు & చెక్స్ లను రిసీవ్ చేసుకున్న రోజునే దానికి సంబందించిన బ్యాంక్ లో జమ చేయాలి.
 ఒక వేళ కుదరక పొతే తర్వాతి రోజున మొదట భాగం లో జమ చేయాలి కానీ రిసివ్ చేసుకున్న 24 గంటల్లో జమ చేయాలి .
 ఒక వేళ సెలవు రోజుకు ముందు రోజున ఏదైనా రిసిప్ట్ స్వీకరిస్తే దానిని ఆ రోజు మధ్యాహ్నం పూటనే జమ చేయాలి.

నగదు & చెక్స్ లను బ్యాంక్ లలో జమ చేయాలి :-

 ఒక వేళ సెలవు రోజుకు ముందు రోజున ఏదైనా రిసిప్ట్ ను ఆ రోజు మధ్యాహ్నం పూట స్వీకరిస్తే దానిని తర్వాతి పని దినాన జమ చేయాలి .
 లెడ్జర్ బుక్స్ ని ఒరిజనల్ రిజిస్టర్ ఎంట్రి లతో సరిచూడాలి .

డిమాండ్ –కలెక్షన్ –బేలన్స్ ల అప్ డేషన్ :-

 ఆదాయాల కలెక్షన్ లను DCB లలో పోస్ట్ చేయాలి.
 వీటి ఆధారం గా సం. చివరలో ఆన్ని ఆదాయాలను క్రోడికరించవచ్చు.

నెల వారీగా చేయాల్సిన ప్రోసిజర్స్ :

• బ్యాంక్ రికన్సి లేషన్ , ట్రెజరీ రికన్సి లేషన్ లను పూర్తి చేయాలి .
• ఒక వేళ నగదు పుస్తకానికి,ట్రెజరీ బేలన్స్ కి తేడాలు ఉంటే సరి దిద్దాలి. .

 రిజిస్టర్ లో ఆదాయ/ఖర్చుల ఒక వేళ ఏదైనా తేడా ఉంటే వాటిని సరి దిద్దాలి
 బ్యాంక్ అంకెలకు – ఆదాయాల రిజిస్టర్ కు తేడా లు ఉంటె సరిదిద్దాలి .
 నెల వారీ ఆదాయాల & ఖర్చుల వివరాలను ఆయా హెడ్స్ కి అనుగుణం గా మొత్తాలను అప్ డేట్ చేయాలి .

వార్షిక ప్రోసిజర్స్ :-

స్టోర్స్ ని ప్రత్యక్షం గా తనిఖీ చేయాలి –
కనీసం సం. ఒక సారి , అకౌంట్ సం. చివరి రోజున తనిఖీ ని చేపట్టాలి.

వార్షిక ప్రోసిజర్స్ :-
వార్షిక ప్రోసిజర్స్ :-
 దీన్ని స్టోర్ ఇన్ చార్జ్ , డిజిగ్నేటెడ్ అధికారి / ఆడిట్ వారి సమక్షం లో చేయాలి.
 ఆస్తుల ప్రత్యక్షం గా తనిఖీ చేయాలి – స్థిర ఆస్తులను కనీసం సం. ఒక సారి తనిఖీ ని చేపట్టాలి.
 ఒక వేళ ఏదైనా తేడా ఉంటే వాటిని సరి దిద్దాలి

అడ్వాన్స్ ల రికన్సిల్ & అప్ డేట్ :-
అకౌంట్ సం. ముగిసిన తర్వాత ఉద్యోగులకు గాని /పంపిణి దారులకు గాని /కంట్రా క్టర్స్ …ఇలా ఎవరికైనా అడ్వాన్స్ లు ఇచ్చి ఉంటే..
వాటిని అప్ డేట్ మరియు రికన్సిల్ చేయాలి.
ఒక వేళ ఏదైనా తేడా ఉంటే వాటిని సరి దిద్దాలి .
లెడ్జర్స్ ముగించడం :-
 అన్ని లెడ్జర్స్ ని ఆర్ధిక సం.చివర అనగా మార్చ్ 31 న కూడి వాటిని ముగించి TRAIL Balance లోనికి ఈ వివరాలు వివరాలను తీసుకుని వెళ్ళాలి.
 వాటి ద్వారా ఆర్ధిక స్టేట్ మెంట్స్ ని తయారీ చేయాలి.