సుప్రీంకోర్టు తాజా తీర్పులు

సుప్రీంకోర్టు తాజా తీర్పులు

 

Amazon product influencer URL
పోటీ పరీక్షల పుస్తకాల కోసం :-
https://www.amazon.in/shop/groupschannelappsctspsc

వేకువజామునే దీపావళి ధమాకా

 • తమిళనాడు, పుదుచ్చేరి మత సంప్రదాయాలకు అనుగుణంగాదీపావళి, ఇతర పండగల సందర్భంగా ఆ రాష్ట్రాల్లో వేకువజామునే 30–6.30వరకు బాణసంచా కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.
 • టపాసులు పేల్చే సమయాన్ని మార్చుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని, కానీ అందుకు పరిమితి రెండు గంటలే అని పేర్కొంది.
 • తక్కువ శబ్దం, కాలుష్యం వెదజల్లే గ్రీన్‌ క్రాకర్స్‌ కు సంబంధించి తాము జారీచేసిన మార్గదర్శకాలు ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ ప్రాంతానికే పరిమితమని కోర్టు స్పష్టతనిచ్చింది.

నేపధ్యం :-

 • తమ మత సంప్రదాయాల ప్రకారం దీపావళి పర్వదినాన ఉదయం పూట బాణసంచా కాల్చుకోవడానికి అనుమతి ఇవ్వాలని తమిళనాడు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారిస్తూ తాజా ఆదేశాలు జారీచేసింది.
 • దీపావళి, ఇతర పండగల సందర్భంగా రాత్రి 8–10 గంటల మధ్యే టపాసులు కాల్చాలని అక్టోబర్‌ 23నసుప్రీంకోర్టు తీర్పు.
 • బేరియం సాల్ట్‌ పై నిషేధ౦పై కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ ఏఎన్‌ఎస్‌ నాదకర్ణి స్పందిస్తూ.. బేరియం సాల్ట్‌ లేకుండానే బాణసంచా తయారుచేయొచ్చని, ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేస్తానని కోర్టుకు చెప్పారు.
 • ధర్మాసనం :- జస్టిస్ K.సిక్రీ &జస్టిస్ .అశోక్ భూషణ్ లతో కూడిన ధర్మాసనం

రఫేల్‌పై పిల్‌ను ఎన్నికల తర్వాత విచారించండి 

 • రాజకీయ ప్రేరేపిత కారణాలతోనే పిల్‌ను వేశాననే ఆరోపణలు రావడంతో మొట్టమొదట దాఖలు చేసిన న్యాయవాది మనోహర్‌లాల్‌ శర్మ మధ్యంతర అభ్యర్థనను దాఖలు చేశారు
 • రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత విచారించాలని దానిని మొట్టమొదట దాఖలు చేసిన న్యాయవాది మనోహర్‌లాల్‌ శర్మ సుప్రీంకోర్టును కోరారు.
 • రఫేల్‌పై మరో న్యాయవాది నుంచి వచ్చిన పిల్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

సాన సతీశ్‌కు భద్రత కల్పించండి -హైదరాబాద్‌ పోలీసులకు సుప్రీం ఆదేశం

 • కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై అవినీతి కేసులో కీలకంగా ఉన్న సాన సతీశ్‌ కేంద్ర నిఘా సంస్థ(సీవీసీ) దర్యాప్తు ముగిసేంతవరకు తనకు పోలీసు రక్షణ కల్పించాలని విన్నవించారు.
 • ధర్మాసనం :-సతీశ్‌ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం  విచారణ నిర్వహించింది.
 • ప్రజావేగుగా మారినట్లు చెప్పుకుంటున్న వ్యక్తి తన ప్రాణాలకు ముప్పుందని భయపడుతుంటే.. ఆయనకు రక్షణ కల్పించాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది
 • తనను ప్రశ్నించేందుకుగాను సీబీఐ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ సతీశ్‌ చేసిన అభ్యర్థనను నిరాకరించింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.కె.పట్నాయక్‌ సమక్షంలోనే తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలంటూ చేసుకున్న వినతిని కూడా తోసిపుచ్చింది.

29102018                   అయోధ్య కేసు విచారణ వాయిదా

 • అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదాస్పద ప్రాంతంపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది.
 • ధర్మాసనం:- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ కేఎం జోషిల ధర్మాసనం ఈ మేరకు సోమవారం(29.10.2018) ఆదేశాలు వెలువరించింది.
 • వివాదాస్పద రామజన్మభూమి–బాబ్రీ మసీదు ప్రాంతంలోని 77 ఎకరాల భూమిని సమంగా విభజించి సున్నీ వక్ఫ్‌ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లా సంస్థలకు కేటాయించాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది.

వాహనాలపై సుప్రీం నిషేధం

 • దేశ రాజధానిలోకాలుష్య తీవ్రతను తగ్గించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లో 15 ఏళ్ల కిందటి పెట్రోల్‌ వాహనాలు, పదేళ్ల కిందటి డీజిల్‌ వాహనాల రాకపోకలను నిషేదించింది.
 • రాజధాని రోడ్లపై ఈ వాహనాలు తిరిగితే స్వాధీనం చేసుకోవాలని రవాణా శాఖను సుప్రీం కోర్టు ఆదేశించింది.
 •  జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం
 • పౌరులు కాలుష్యంపై ఫిర్యాదు చేసేందుకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే సోషల్‌ మీడియలో ఖాతాను అందుబాటులోకి తీసుకురావాలని CPCB కి సూచించింది. గతంలో దేశ రాజధానిలో పాత వాహనాల రాకపోకలను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ సైతం నిషేధించింది.

Redmi y2 mobile: https://amzn.to/2EFYVeb

సుప్రీంకోర్టు తాజా తీర్పులు

అలోక్‌ వర్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం

 • తనను అకారణంగా సెలవుపై పంపుతూ, తన స్ధానంలో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావును డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించాలని అలోక్‌ వర్మ తన పిటిషన్‌లో సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరారు.
 • అలోక్‌ వర్మపై వచ్చిన ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని సీవీసీని ఆదేశించింది.
 • అలోక్‌ వర్మ, రాకేష్‌ ఆస్ధానాలపై విచారణను సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జడ్జి K పట్నాయక్ కి అప్పగింత.
 • సీబీఐ నూతన చీఫ్‌గా నియమితులైన ఎం. నాగేశ్వరరావు కేవలం పరిపాలనా వ్యవహారాలనే పర్యవేక్షించాలని, ఎలాంటి విధాన నిర్ణయాలను తీసుకోరాదని స్పష్టం చేసింది.
 • ధర్మాసనం :- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్‌ విచారణకు చేపట్టిందికేంద్రం, విజిలెన్స​ కమిషన్‌ తనను సీబీఐ చీఫ్‌గా తప్పిస్తూ రాత్రికిరాత్రి తీసకున్న నిర్ణయం అక్రమమని, సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చేలా కేంద్రం జోక్యం చేసుకుందని అలోక్‌ వర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

29102018ఎస్సీ, ఎస్టీ చట్టంలో సవరణలు సబబే-సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రంలో కేంద్రం

 • ఎస్సీ, ఎస్టీల వేధింపుల నిరోధక చట్టంలో తీసుకువచ్చిన సవరణలు సబబేనంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
 •  ఈ చట్టం కింద అరెస్టులకు వీలు కల్పిస్తున్న నిబంధనల తీవ్రతను తగ్గిస్తూ మార్చి 20న సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చిన తర్వాత ఆగస్టు 9న తాము చేసిన సవరణల్ని సమర్థించుకుంటూ అదే న్యాయస్థానంలో ప్రమాణపత్రం దాఖలు చేసింది.
 • ఇలాంటి సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందని దీనిలో తెలిపింది. తప్పుడు కేసులు నమోదు కావడం, చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండడం వల్లనే ఈ చట్టం కింద చాలా మంది శిక్షల్ని తప్పించుకుంటున్నారని అనుకోవడం సరికాదని పేర్కొంది.
 • కొన్ని గణాంకాలను నివేదిస్తూ… ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు తగ్గలేదని తెలిపింది.
 • 2014, 2015, 2016 సంవత్సరాల్లో వరసగా 47124, 44839, 47338 చొప్పున కేసులు నమోదయ్యాయని వివరించింది. వరసగా 8%, 25.8%, 24.9% మందికి శిక్షలు పడ్డాయని నివేదించింది.


గ్రూప్స్ ఛానెల్ లోని మెటీరియల్
గ్రూప్స్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ కావడానికి క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCsT09Rkupo6zVbvW5Qrbv5w
ప్లాగ్ షిప్ పధకాలు -2 :: https://youtu.be/yKhCd4uAJR8
ప్లాగ్ షిప్ పధకాలపై 100 ప్రాక్టిస్ ప్రశ్నలు :: https://youtu.be/_nEvMRPEjUk
14 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు:: https://youtu.be/Ci6DuPNsDEM
పంచాయత్ రాజ్ వ్యవస్థ పై కమిటీలు: : https://youtu.be/_WL7UfIk9FU
గ్రామ పంచాయతీ ల ఆదాయ వ్యయాల నిర్వహణ(AP): : https://youtu.be/YpnaC4AyXdg
ఆదాయ వ్యయాలు పధకాల అకౌంటింగ్ :: https://youtu.be/cg1g99uU7No
ఆడిట్ & అకౌంట్స్ పంచాయతీ కార్యదర్శి: https://youtu.be/jkJthQeFO6E
అకౌంటింగ్ (పార్ట్ 4) :: https://youtu.be/vCJDNFbbxdE
అకౌంటింగ్ (పార్ట్ 5) :: https://youtu.be/HDzz3Sfnxx8
మోడల్ అకౌంటింగ్ వ్యవస్థ (పార్ట్ 6) :: https://youtu.be/-7s5vR73s2A
పంచాయతీ బడ్జెట్ : https://youtu.be/Vfgt42atCrE
పి డి అకౌంట్స్ : https://youtu.be/Vtf7swDg-Fc
నెగిటివ్ మార్క్స్ ని అధిగమించడం ఎలా ?:: https://youtu.be/0Vs2ssoj2Lw
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2017-18 :: https://youtu.be/mmHibTvyXmY
మానావాభి వృద్ధి HDI రిపోర్ట్ 2018 :: https://youtu.be/EJVEDWjAr4o
ప్లాగ్ షిప్ పధకాలు -1 :: https://youtu.be/_u696gRw5g4
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2016-17 పార్ట్ 2 :: https://youtu.be/JoeKj0C0GcI
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం పై 100 ప్రశ్నలు::పార్ట్ -3:: https://youtu.be/xPUCAhyST0c
15 ఆర్ధిక సంఘం –నిర్మాణం –విధి –విధానాలు :: https://youtu.be/JbIZvW28YH4
ఆర్థిక సంఘం పై 25 ప్రశ్నలు:: https://youtu.be/sywQUjKMkPc

సుప్రీం కోర్ట్ కేసులు అక్టోబర్ 2018  డౌన్ లోడ్ this document