సైన్స్ & టెక్నాలజీ కరెంట్ అఫైర్స్

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :-

https://www.amazon.in/shop/groupschannelappsctspsc

31102018

సూర్యుడికి అత్యంత చేరువలో ‘పార్కర్‌’

 నాసా ప్రయోగించిన ‘పార్కర్‌’ అంతరిక్ష నౌక సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లినది.
 మానవుడు తయారు చేసిన ఓ వస్తువు సూర్యుడికి చాలా సమీపానికి వెళ్లడం ఇదే తొలిసారి.
 అంతరిక్ష వాతావరణంపై సూర్యుడి ఉపరితల వాతావరణం చూపే ప్రభావం తదితర రహస్యాలను చేధించేందుకు 2018, ఆగస్టు 12న ‘పార్కర్‌’ను ప్రయోగించారు.
 అక్టోబర్‌ 29 నాటికి సూర్యుడి ఉపరితలానికి ఈ పార్కర్‌ 4.2 కోట్ల మైళ్ల దూరంలో ఉన్నట్లు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ బృందం లెక్కించింది.
 1976 ఏప్రిల్‌లో జర్మన్‌–అమెరికన్‌ హీలియోస్‌–2 అంతరిక్ష నౌక సూర్యుడికి సమీపంలోకి వెళ్లి రికార్డు సృష్టించింది.
 పార్కర్‌ చివరికి సూర్యుడికి 61.6 లక్షల కిలోమీటర్ల దూరంలో ఆగుతుందని, 2024లో ఈ అద్భుతం చోటు చేసుకునే అవకాశం ఉందని నాసా వెల్లడించింది.

తొలి ఇంజన్ రహిత రైలుప్రారంభం
దేశ తొలి ఇంజన్ రహిత సెమీ హైస్పీడ్ రైలు ‘ట్రైన్ 18’ ప్రారంభమైంది.
 చెన్నైలోఅక్టోబర్ 29న రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహని ఈ రైలును ప్రారంభించారు. రైలు ఢిల్లీకి బయలుదేరింది.
 చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) లో తయారీ.
 సెమీ హైస్పీడ్‌ రకానికి చెందిన ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
 18 నెలల్లో తయారుచేసిన ఈ రైలు కోసం రూ. వంద కోట్లు వెచ్చించారు.
 గత 30 ఏళ్లుగా నడుపుతున్న శతాబ్ధి ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు బదులుగా ‘ట్రైన్ 18’ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
 2019-20 చివరి నాటికి మరో ఐదు రైళ్లు తయారుచేయనున్నట్లు వెల్లడించింది.

30102018 కాలుష్యానికి 6 లక్షల చిన్నారుల బలి
 ‘ఆరోగ్యం–వాయు కాలుష్యం ప్రభావం’పై త్వరలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో రూపొందించిన ఈ నివేదికను డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టీఏ ఘెబ్రెయ్‌సస్‌ వెల్లడించారు
వివరాలు:
 నిత్యం 15 ఏళ్లలోపు పిల్లలలో (93%) 180 కోట్ల మంది(వీరిలో 63 కోట్ల మంది ఐదేళ్లలోపు బాలలు) కలుషిత గాలిని పీలుస్తున్నారు.
 ఫలితంగా శ్వాసకోశ వ్యాధులకు గురై 2016లో దాదాపు 6 లక్షల మంది చిన్నారులు చనిపోయారు.
 ప్రతి పది మందిలో 9 మంది కలుషిత గాలినే పీలుస్తున్నారు.
 దీని కారణంగా ఏటా 70 లక్షల గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తున్నాయి
ఐదేళ్లలోపు చనిపోయే ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు వాయు కాలుష్యం కారణంగానే చనిపోతున్నారు.
28102018 ‘శక్తి’ మైక్రోప్రాసెసర్ ఆవిష్కరణ
 దేశంలో తొలిసారిగా తయారుచేసిన ‘శక్తి’ మైక్రోప్రాసెసర్‌ను మద్రాసు ఐఐటీ అక్టోబర్ 26న ఆవిష్కరించింది.
 చండీగఢ్‌లోని ఇస్రో సెమీ-కండక్టర్ ల్యాబ్‌లో శక్తి ని తయారు చేశారు.
 రక్షణ, అణు శక్తి రంగాలతో పాటు ప్రభుత్వ సంస్థలకు ఈ మైక్రోప్రాసెసర్ ఉపయోగపడుతుంది

గబ్బిలాన్ని పోలిన వినూత్న రోబో
గబ్బిలాన్ని పోలిన వినూత్న, అత్యాధునిక రోబోను ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అభివృద్ధి పరిచారు.
 కళ్లు కనిపించకున్నా, కటిక చీకట్లో సైతం గబ్బిలం ఎలాగైతే ప్రతిధ్వని ఆధారంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుందో, అదేవిధంగా వివిధ పర్యావరణాల్లో పనిచేసే రోబోను ఇటామర్‌ ఎల్యాకీమ్‌ అనే విద్యార్థి ఆధ్వర్యాన రూపొందించారు.
 భవిష్యత్తులో మరింత అత్యాధునిక రోబోల తయారీకి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అంతరిక్షయానంతో మెదడుపై దుష్ప్రభావం-రష్యా వ్యోమగాములపై తొలిసారిగా అధ్యయనం
దీర్ఘకాలంపాటు అంతరిక్షంలో గడిపితే కండరాల క్షీణత, ఎముకల్లో సాంద్రత తగ్గుతుందనే ఇంతవరకు తెలుసు.
 మెదడుపై కూడా దుష్ప్రభావం పడుతుందని రష్యా వ్యోమగాములపై చేసిన పరిశోధనలో తొలిసారిగా వెల్లడైంది.
 అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో 189 రోజులపాటు గడిపిన 10మంది వ్యోమగాములపై జరిపిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది.
 అవగాహనశక్తిలో తేడాలొచ్చే అవకాశముంది. సూక్ష్మగురుత్వాకర్షణ శక్తి కారణంగా మెదడులోని కణజాలం ఎలా ప్రభావితమవుతుందో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ పీటర్‌ జు యూలెన్‌బర్గ్‌ పేర్కొన్నారు.
 భూమికి చేరుకున్న తరువాత కూడా కనీసం ఆరునెలలపాటు మెదడులోని మూడుకణజాలాల పరిమాణంలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు గమనించామన్నారు.

కిటికీలు మూసెయ్యండి -దిల్లీవాసులకు ప్రభుత్వ సంస్థల సూచనలు
దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత నానాటికీ క్షీణిస్తున్న నేపథ్యంలో CPCB,SAFAR లు చర్యలు .
 కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి- CPCB
 వాయు నాణ్యత అంచనా-పరిశోధన వ్యవస్థ –SAFAR(సఫర్‌)
 System of Air Quality and Weather Forecasting And Research (IITM-PUNE)
 కాలుష్య తీవ్రతను ఎదుర్కొనే దిశగా దిల్లీవాసులకు ఈ రెండు సంస్థలు విడివిడిగా సూచనలు జారీ చేశాయి.
 కిటికీలు మూసి ఉంచాలని, బయటకు వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని సిఫార్సు చేశాయి. ప్రైవేటు వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించాయి.
తీర గస్తీ దళ విమానాల ఆధునికీకరణ
 తీర గస్తీ దళానికి చెందిన 17 డోర్నియర్‌ విమానాల ఆధునికీకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
 రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ)..ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
 ఈ ఆధునికీకరణ పనులకు దాదాపు రూ.950 కోట్లు ఖర్చు కానున్నాయి.
 ప్రభుత్వ రంగ విమాన తయారీ సంస్థ హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ పనులను చేపడుతుందని రక్షణశాఖ అధికారులు తెలిపారు.
 అధునాతన సాంకేతికత, విడి విభాగాలతో విమానాలను ఆధునికీకరిస్తుందని వివరించారు. సముద్ర నిఘాకు సంబంధించి.. తీర గస్తీ దళంలో డోర్నియర్‌ విమానాలది చాలా ముఖ్యమైన పాత్ర.

27102018 ఉచిత యాప్‌లు.. గూఢచారులు!
 ‘ప్లేస్టోర్‌’లో అందుబాటులో ఉన్న ఉచిత యాప్‌లలో దాదాపు 90శాతం వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి లేకుండానే గూగుల్‌కు చేరవేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది.
 ఇందులో వినియోగదారుల వయస్సు, లింగం, ప్రాంతం, వారు వాడుతున్న యాప్‌లు తదితర సమాచారం ఉంటోందని ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌(FT)’ నివేదిక స్పష్టం చేస్తోంది.
 ఈ సమాచారాన్నంతా వాణిజ్యావసరాలకు.. ముఖ్యంగా ప్రకటనలు గుప్పించడానికి వాడుతున్నారని తెలిపింది.
 నివేదిక ప్రకారం 43శాతం యాప్‌లు వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు చేరవేస్తున్నాయి.
 ఈ నివేదికలోని అంశాలను గూగుల్‌ ఖండించింది.
‘‘గూగుల్‌, గూగుల్‌ ప్లేస్టోర్స్‌కు సంబంధించి కచ్చితమైన విధానాలు, మార్గదర్శకాలు పాటిస్తున్నాం. యాప్‌లు అభివృద్ధి చేసేవారు వినియోగదారుల సమాచారాన్ని వినియోగించుకోవడానికి తప్పక అనుమతి తీసుకోవాలి. లేదంటే అలాంటి యాప్‌లపై చర్యలు తీసుకుంటాం’’ అని గూగుల్‌ ప్రతినిధి స్పష్టం చేశారు.
26102018 ఎగిరే రోబోను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
 అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎగిరే రోబోను అభివృద్ధి చేశారు.
 ఫ్లైక్రో టగ్స్ గా పిలిచే ఈ రోబో రిమోట్‌తో ఆదేశిస్తే సహాయకుడిలా అన్ని పనులు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
 ఆహారం తేవడం, కెమెరాతో వీడియో తీయడం వంటి ఎన్నో చిన్న చిన్న పనులు చేసేలా ఈ రోబోను రూపొందించారు.
 ఈ రోబోను దాని బరువు కంటే 40 రెట్లు ఎక్కువ బరువును మోసేలా అభివృద్ధి పరిచారు. భవిష్యత్తులో ఈ రోబోల్లో స్వీయనియంత్రణ వ్యవస్థను ప్రవేశపెట్టేలా పరిశోధనలు చేస్తున్నామని వర్సిటీ శాస్త్రవేత్త మార్క్ కట్కోస్కై తెలిపారు.

పరిశోధనల ప్రోత్సాహానికి రెండు పథకాలు
దేశంలో మానవ వనరులు, శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు కొత్తగా రెండు పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
 ‘సామాజిక శాస్త్రాల్లో ప్రభావవంత విధానాల పరిశోధన’ (ఇంప్రెస్),
 Impactful Policy Research in Social Science’ (IMPRESS)
 ‘విద్యా సంబంధిత, పరిశోధనల్లో తోడ్పాటుకు పథకం’ (స్పార్క్).
 Scheme for Promotion of Academic and Research Collaboration (SPARC)”
 ఈ మేరకు ఈ రెండు వెబ్‌సైట్లను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ అక్టోబర్ 25న ఆవిష్కరించారు.
 ఇంప్రెస్ పథకానికి కేంద్రం ఏటా రూ. 414 కోట్లు కేటాయిస్తుంది.మానవ వనరుల రంగంలోనూ పరిశోధనలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువచ్చినట్లు చెప్పారు.
2022లో

పాక్‌ మానవసహిత అంతరిక్షయాత్ర!
 పాకిస్థాన్‌ ,చైనా సహకారంతో 2022లో తమ దేశ పౌరుడిని అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించినట్లు పాక్‌ సమాచార మంత్రి ఫవద్‌ చౌధరి తెలిపారు.

ISRO – కార్యక్రమాలు
 2022 కల్లా భారత్‌ తరపున తొలిసారి అంతరిక్షంలోకి మనిషిని పంపే ప్రయోగాన్ని పూర్తి చేస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ కె.శివన్‌ స్పష్టం చేశారు.
 తమ కలల ప్రాజెక్టు చంద్రయాన్‌-2ను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో దేశీయ వాహక నౌక ద్వారా చేపడతామని తెలిపారు.

100 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ ఇవ్వడమే లక్ష్యం
‘‘ప్రధాని పిలుపునిచ్చిన ‘డిజిటల్‌ ఇండియా’లో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకూ 100 జీబీపీఎస్‌ వేగంతో అంతర్జాలం అందించే లక్ష్యంగా పనిచేస్తున్నాం.సైన్స్ & టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ చివరి వారం NEWసైన్స్ & టెక్నాలజీ కరెంట్ అఫైర్స్

 ఇంక్యుబేషన్‌, పరిశోధనా కేంద్రాలు
 యువ ఇంజినీర్లకు అవకాశాలు ఇవ్వడం కోసం ఇస్రో దేశం నలుమూలలా ఆరు ఇంక్యుబేషన్‌, పరిశోధనా కేంద్రాలు నెలకొల్పుతోంది.
 ఇప్పటికే అగర్తలలో ఓ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు
 జలంధర్‌, భువనేశ్వర్‌, ఇండోర్‌, నాగ్‌పుర్‌, కొచ్చిల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది.
 ఇదే విధంగా గువహటి, జయపుర, కురుక్షేత్ర, కన్యాకుమారి, పట్నా, వారణాసిలో పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.’’ అని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ వివరించారు.

పోటీ పరీక్షల పుస్తకాల కోసం :-
https://www.amazon.in/shop/groupschannelappsctspsc

గ్రూప్స్ ఛానెల్ లోని మెటీరియల్
గ్రూప్స్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ కావడానికి క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCsT09Rkupo6zVbvW5Qrbv5w
ప్లాగ్ షిప్ పధకాలు -2 :: https://youtu.be/yKhCd4uAJR8
ప్లాగ్ షిప్ పధకాలపై 100 ప్రాక్టిస్ ప్రశ్నలు :: https://youtu.be/_nEvMRPEjUk
14 వ ఆర్ధిక సంఘం ఏర్పాటు, సిఫార్సులు:: https://youtu.be/Ci6DuPNsDEM
పంచాయత్ రాజ్ వ్యవస్థ పై కమిటీలు: : https://youtu.be/_WL7UfIk9FU
గ్రామ పంచాయతీ ల ఆదాయ వ్యయాల నిర్వహణ(AP): : https://youtu.be/YpnaC4AyXdg
ఆదాయ వ్యయాలు పధకాల అకౌంటింగ్ :: https://youtu.be/cg1g99uU7No
ఆడిట్ & అకౌంట్స్ పంచాయతీ కార్యదర్శి: https://youtu.be/jkJthQeFO6E
అకౌంటింగ్ (పార్ట్ 4) :: https://youtu.be/vCJDNFbbxdE
అకౌంటింగ్ (పార్ట్ 5) :: https://youtu.be/HDzz3Sfnxx8
మోడల్ అకౌంటింగ్ వ్యవస్థ (పార్ట్ 6) :: https://youtu.be/-7s5vR73s2A
పంచాయతీ బడ్జెట్ : https://youtu.be/Vfgt42atCrE
పి డి అకౌంట్స్ : https://youtu.be/Vtf7swDg-Fc
నెగిటివ్ మార్క్స్ ని అధిగమించడం ఎలా ?:: https://youtu.be/0Vs2ssoj2Lw
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2017-18 :: https://youtu.be/mmHibTvyXmY
మానావాభి వృద్ధి HDI రిపోర్ట్ 2018 :: https://youtu.be/EJVEDWjAr4o
ప్లాగ్ షిప్ పధకాలు -1 :: https://youtu.be/_u696gRw5g4
ఆంధ్ర ప్రదేశ్ ఎకనామిక్ సర్వే2016-17 పార్ట్ 2 :: https://youtu.be/JoeKj0C0GcI
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం పై 100 ప్రశ్నలు::పార్ట్ -3:: https://youtu.be/xPUCAhyST0c
15 ఆర్ధిక సంఘం –నిర్మాణం –విధి –విధానాలు :: https://youtu.be/JbIZvW28YH4
ఆర్థిక సంఘం పై 25 ప్రశ్నలు:: https://youtu.be/sywQUjKMkPc

కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 15.2018