1,26,728 గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీ- క్రింది వెబ్ సైట్స్ లో దరఖాస్తు చేయండి

నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ- నేటి(27.07.2019) ఉ.11 గంటల నుంచి అందుబాటులోకి.. ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ  వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసిన పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ-మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ఏర్పాటు   విద్యార్హత, వయో పరిమితి,ఎంపిక విధానం వంటి వివరాలన్నీ వెబ్‌సైట్‌లో  సెప్టెంబరు 1న రాత పరీక్ష.. 150 మార్కులు,150 ప్రశ్నలు.. నెగిటివ్‌ మార్కులు కూడా – ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వారికి వెయిటేజీ ఉంటుందని తెలుస్తోంది.

మూడు ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా.. దరఖాస్తులు స్వీకరణ
ఈ ఉద్యోగాలకు అర్హులైన నిర్యుదోగ యువత నుంచి అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు క్రింది  మూడు ప్రత్యేక వెబ్‌సైట్లను సిద్ధంచేశారు .ఈ క్రింది వెబ్ సైట్స్ ను క్లిక్ చేసి దరఖాస్తు చేయండి

గ్రామ సచివాలయం -రిఫరెన్స్ బుక్స్ https://www.amazon.in/shop/groupschannelappsctspsc?listId=W21HGS2NUPT2&cv_ct_id=amzn1.idea.W21HGS2NUPT2&cv_ct_pg=storefront&cv_ct_wn=aip-storefront&ref=exp_cov_groupschannelappsctspsc_vl_vv_d

https://gramasachivalayam.ap.gov.in

https://vsws.ap.gov.in

https://wardsachivalayam.ap.gov.in

ఇవి  శనివారం ఉ.11 గంటల నుంచి ఇవి దరఖాస్తుదారులకు అందుబాటులోకి వస్తాయి. నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం, 22 రకాల ఉద్యోగాలకు వేర్వేరుగా ఏ ఉద్యోగానికి ఏయే విద్యార్హతలు, వయో పరిమితి, ఎంపిక విధానం, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌ వంటి వివరాలను ఆయా వెబ్‌సైట్లలోనే అందుబాటులో ఉంటాయి .

రెండు పరీక్షలు .అన్ని రకాల ఉద్యోగాల భర్తీకి రెండు పరీక్ష విధానం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి ఉద్యోగానికి 150 మార్కులకు రెండు పేపర్ల విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.