NDRF &SDRF

 NDRF నిర్మాణం – బెటా లియన్స్

విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం..
1. కేంద్రంలో- జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ)ను,
2. రాష్ట్రంలో- రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎస్‌డీఎంఏ)ను,
3. జిల్లా స్థాయిలో- జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (డీడీఎంఏ)ను ఏర్పాటు చేశారు.

రోండో పరిపాలన సంస్కరణల సంఘం సిఫారసుతో
73, 74వ రాజ్యాంగ సవరణలతో పట్టణ, గ్రామీణ స్థాయిలో విపత్తు నిర్వహణ సంస్థలు ఏర్పడ్డాయి.
-గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్‌లలో కార్పొరేషన్ మేయర్ విపత్తు నిర్వహణకు బాధ్యత వహిస్తారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్(NDRF)
– విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 44 కింద 2006లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఏర్పాటు చేశారు.
– ఈ దళాలను విపత్తులు వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి రూపుదిద్దారు.
అవి…1. సీఐఎస్‌ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం)
2. బీఎస్‌ఎఫ్ (సరిహద్దు భద్రతాదళం)
3. సీఆర్‌పీఎఫ్ (కేంద్ర రిజర్వు పోలీసు దళం)
4. ఐటీబీపీ (ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు)

5.సహస్త్ర సీమాబల్
– ఒక్కో దళాన్ని రెండుగా చేసి వాటిని 12 బెటాలియన్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి బెటాలియన్‌లో 1000 మంది ఉంటారు.
– సహజ, మానవకారక విపత్తులపై ప్రత్యేక శిక్షణ పొందిన 144 బృందాలు ఈ బెటాలియన్లలో ఉన్నాయి. ఇందులో 72 బృందాలను ప్రకృతి వైపరీత్యాలతో పాటు బయాలాజికల్, రసాయన, రేడియో ధార్మిక, అణు వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఉద్దేశించారు.
డీడీఎంఏ (DDMA)సభ్యులు
1. జిల్లా అథారిటీ సీఈఓ
2. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)
3. జిల్లా వైద్యాధికారి
4. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన జిల్లా స్థాయి ర్యాంక్ అధికారులు
డీడీఎంఏ బాధ్యతలు
1. జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక తయారుచేయడం
2. సమన్వయం చేయడం
3. విపత్తు నిర్వహణ అమలు

4 భద్రతా ప్రమాణాలకు పటిష్టంగా అమలుచేయడం
5. నిర్మాణాలను పరిశీలించడం
6. పునరావాస చర్యలను చేపట్టడం